పూజా హెగ్డే ఇంట పెళ్లి బాజాలు.. ప‌ట్టుచీర‌లో అందంగా మెరిసిపోయిన బుట్ట‌బొమ్మ‌!

టాలీవుడ్ బుట్ట‌బొమ్మ పూజా హెగ్డే ఇంట పెళ్లి బాజాలు మోగాయి. పూజా హెగ్డే అన్న‌ రిషబ్‌ హెగ్డే పెళ్లి పీట‌లెక్కాడు. శివానీ శెట్టి అనే అమ్మాయితో రిషబ్ హెగ్డే ఏడ‌డుగులు వేశాడు. సొంత అన్న‌య్య కావ‌డంతో పెళ్లి ప‌నుల‌న్నిటినీ పూజా హెగ్డే ద‌గ్గ‌రుండి చూసుకుంది. రిష‌బ్ హెగ్డే పెళ్లిలో పుట్టుచీర క‌ట్టుకుని మ‌న బుట్ట‌బొమ్మ అందంగా మెరిసిపోయింది. అలాగే త‌న అన్న పెళ్లి ఫోటోల‌ను పూజా హెగ్డే ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పంచుకుని ఎమోష‌నల్ కామెంట్స్ చేసింది.

`నా సోదరుడు ప్రేమ పెళ్లి చేసుకున్నాడు. ఈ పెళ్లి వేడుక ప్రారంభం నుంచి నేను ఎప్పుడూ లేనంత సంతోషంగా ఉన్నా. ఆనందభాష్పాలు వచ్చాయి. అన్నా మీరు మీ జీవితంలో తదుపరి దశలోకి అడుగుపెడుతున్నప్పుడు అనియంత్రితంగా ప్రేమిస్తారని, నిండు హృదయాన్ని అందిస్తారని, శాంతి, అవగాహనతో ముందుకు సాగుతారని నేను కోరుకుంటున్నా` అంటూ పూజా హెగ్డే త‌న పోస్ట్ లో రాసుకొచ్చింది.

దీంతో పూజా హెగ్డే అన్న పెళ్లి ఫోటోలు సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతున్నాయి. కాగా, పూజా హెగ్డే సినిమాల విష‌యానికి వ‌స్తే.. ప్ర‌స్తుతం ఈ అమ్మ‌డు తెలుగులో మ‌హేష్ బాబుకు జోడీగా `ఎస్ఎస్ఎమ్‌బీ 28`లో న‌టిస్తోంది. త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రం ఇటీవ‌లె సెట్స్ మీద‌కు వెళ్లింది. ఈ మూవీతో పాటు పూజా హెగ్డే బాలీవుడ్ లో రెండు సినిమాలు చేస్తోంది.

https://www.instagram.com/p/CoAIvZhJC-n/?utm_source=ig_web_copy_link