రీ రిలీజ్ లో కూడ ఒక్కడు సినిమా రికార్డ్..!!

ఈ మధ్యకాలంలో తెలుగు సినీ ఇండస్ట్రీలో రీ రిలీజ్ సినిమాల హవానే ఎక్కువగా కొనసాగుతోంది. మొదట పోకిరి సినిమాతో విడుదలైన ఈ పద్ధతి ఆ తర్వాత ఎంతో మంది హీరోలు సైతం తమ చిత్రాలను విడుదల చేస్తున్నారు. ఈ ఏడాది జనవరి-7 వ తేదీన మహేష్ ఒక్కడు సినిమాని రీ రిలీజ్ చేయడం జరిగింది. రెండు తెలుగు రాష్ట్రాలలోనే భారీగా విడుదలైన ఈ సినిమా థియేటర్ల దగ్గర మహేష్ అభిమానులు ఒక రేంజ్ లో సందడి చేసినట్లుగా తెలుస్తోంది. మరొకసారి ఆర్టీసీ క్రాస్ రోడ్లో మహేష్ స్టామినా ఏంటన్నది ఫ్రూప్ చేశారు.

Okkadu | Telugu | Full movie - video Dailymotion
ఆర్టీసీ క్రాస్ రోడ్ లో థియేటర్లో మహేష్ ఒక్కడు సినిమా రూ.16.93 లక్షలు కలెక్షన్ చేసి రికార్డు సృష్టించింది. ఇప్పటివరకు ఏ సినిమాకి ఈ రేంజ్ లో కూడా అక్కడ కలెక్షన్ రాలేదని సమాచారం. మరొకసారి బాక్స్ ఆఫీస్ దగ్గర మహేష్ బాబు తన స్టామినా ప్రూఫ్ చేశారని చెప్పవచ్చు. మహేష్ ఫ్యాన్స్ కి ఒక్కడు సినిమా అంటే విపరీతమైన క్రేజ్ అని చెప్పడంలో సందేహం లేదు. ఎమ్మెస్ రాజు నిర్మించిన ఈ చిత్రాన్ని డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో మహేష్ స్పోర్ట్స్ బ్యాక్ గ్రౌండ్ లో కనిపిస్తారు. భూమిక హీరోయిన్గా నటించిన మణిశర్మ అద్భుతమైన మ్యూజిక్ ని అందించారు.

MAHESH !! on Twitter: "Pokiri & Okkadu At Sudarshan !! Happened Like A  Miracle ❤️‍🔥 #OkkaduCelebrations @urstrulymahesh https://t.co/ibX04jSlj1"  / Twitter
ఇక మహేష్ కెరియర్ లో ప్రత్యేకంగా నిలిచిన ఈ ఒక్కడు సినిమా చాలామంది దర్శకులు అవ్వాలనుకునే వారికి ఒక మార్గదర్శకంగా నిలిచిందని అప్పట్లో వార్తలు వినిపించాయి. ఈ చిత్రంతోనే మహేష్ మాస్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఒక్కడు సినిమా మహేష్ కెరియర్ కు టర్నింగ్ పాయింట్ అని చెప్పవచ్చు అప్పటివరకు ఫ్యామిలీ ఆడియన్స్ ని మెప్పించిన మహేష్ ఈ సినిమాతో మాస్ హీరోగా మారారు.