బాలయ్య సినిమాలో జయమ్మ క్యారెక్టర్ హైలెట్ గా ఉండనుందా…?

సాధారణంగా బాలకృష్ణ నటించిన సినిమాలలో ఎక్కువగా డైలాగ్స్ మాత్రమే బాగా పాపులర్ అవుతూ ఉంటాయి. బాలయ్య నటించిన వీర సింహారెడ్డి సినిమా ట్రైలర్ చూస్తే ఈ సినిమాలో వరలక్ష్మి శరత్ కుమార్ బాగా ఆకట్టుకునేలా కనిపిస్తోంది. వీరసింహారెడ్డి వరలక్ష్మి వీరంగం ఆడేస్తోందని వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. గతంలో కూడా గోపీచంద్ మలినేని డైరెక్షన్లో వచ్చిన క్రాక్ సినిమాలో జయమ్మ పాత్రలో అదరగొట్టేసింది. ముఖ్యంగా వరలక్ష్మి శరత్ కుమార్ అంటే గుర్తుపట్టలేదేమో కానీ జయమ్మ అంటే కచ్చితంగా ఆడియన్స్ గుర్తుపట్టేలా తన నటనతో ఆకట్టుకుంది.

𝑽𝒂𝒓𝒂𝒍𝒂𝒙𝒎𝒊 𝑺𝒂𝒓𝒂𝒕𝒉𝒌𝒖𝒎𝒂𝒓 (@varusarath5) / Twitterఎంతోకాలం తర్వాత తెలుగు సినీ ఇండస్ట్రీ లోకి ఒక లేడీ విలన్ దొరికిందని చెప్పవచ్చు. వీర సింహారెడ్డి సినిమాలో విలన్ భార్యగా విల్లన్ తో పాటు ఈక్వల్ రేంజ్ లో డైలాగులు చెప్పి నట్లు గా కనిపిస్తోంది వరలక్ష్మి. ఇక ఈ చిత్రంలో ఈమె పాత్ర నిజంగానే ఆడియన్స్ కు ఒక సర్ప్రైజ్ అనిపిస్తోందని చిత్ర బృందం ఇదివరకే తెలియజేశారు. వీర సింహారెడ్డి సినిమాలో వరలక్ష్మి పద్మ అనే పాత్రలో కనిపించబోతోంది. ఆమె కట్టుబొట్టు లేడీ విలన్ గా సూపర్ గా సెట్ అయిందని వార్తలు కూడా వినిపిస్తున్నాయి.

Veera Simha Reddy USA Pre-Sales: Above $700K premieres is very much on cardsఒకవేళ ఈ సినిమా సక్సెస్ అయ్యిందంటే చాలు లేడీ విలన్ గా తనదైన ముద్ర వేసుకుంటుంది వరలక్ష్మి శరత్ కుమార్. ఇలాగే తన కెరియర్ కొనసాగితే రాబోయే రోజుల్లో మరిన్ని అవకాశాలు వెలుపడతాయి. వరలక్ష్మి శరత్ కుమార్ కు తెలుగులోనే కాకుండా తమిళంలో కూడా మంచి క్రేజీ ఉందని చెప్పవచ్చు.హీరోయిన్గా చేయడం కంటే విలన్ గా చేయడమే చాలా సులువైన పాత్రలు ఈమెకి ఆనీ చెప్పవచ్చు. మరి వీర సింహారెడ్డి సినిమాని సక్సెస్ బాట పట్టేలా చేస్తుందేమో చూడాలి మరి.