ఆఫ‌ర్ల కోసం అందాల వ‌ల‌.. న‌భాను కాస్త ప‌ట్టించుకోండ‌య్యా!

నభా నటేష్.. ఈ ముద్దుగుమ్మ గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `ఇస్మార్ట్ శంకర్` మూవీతో టాలీవుడ్ లో విప‌రీత‌మైన క్రేజ్ సంపాదించుకున్న న‌భా న‌టేష్‌.. ఆ త‌ర్వాత హిట్లు, ఫ్లాపుల‌తో సంబంధం లేకుండా బ్యాక్ టు బ్యాక్ ఆఫ‌ర్ల‌తో ఫుల్ బిజీగా గ‌డిపింది.

అయితే గ‌త ఏడాది మాత్రం న‌భా వెండితెర‌పై క‌నిపించ‌లేదు. అందుకు కార‌ణం ఆఫ‌ర్లు రాక‌పోవ‌డ‌మే అని అంద‌రూ అనుకున్నారు. కానీ, ఇటీవ‌ల ఈ ముద్దుగుమ్మ అస‌లు నిజాన్ని బ‌య‌ట పెట్టి అంద‌రికీ షాక్ ఇచ్చింది.

త‌న‌కు ఒక భారీ ప్ర‌మాదం జ‌ర‌గ‌డం వ‌ల్లే సినిమాల నుంచి గ్యాప్ తీసుకున్నాన‌ని.. మల్టిపుల్ బోన్ ఫ్రాక్చర్ జరిగింద‌ని, కొన్ని కాంప్లికేటెడ్ సర్జరీలు కూడా జరిగాయ‌ని ఆమె పేర్కొంది. అయితే ఆ ప్ర‌మాదం నుంచి ఇప్పుడు న‌భా పూర్తిగా కోలుకుంది.

ప్ర‌స్తుతం ఈ అమ్మ‌లు ఆఫ‌ర్ల కోసం సోష‌ల్ మీడియా వేదిక‌గా అందాల వ‌ల విసురుస్తోంది. తాజాగా కూడా ట్రెండీ దుస్తుల్లో ఒంపు సొంపులు పోతూ హాట్ హాట్ గా ఫోటోల‌కు పోజులు ఇచ్చింది. ఒంగి ఒంగి ఎద అందాల‌ను చూపిస్తూ ఉక్కిరి బిక్కిరి చేసింది.

నభా తాజా పిక్స్ సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతున్నాయి. న‌భా గ్లామ‌ర్ షోకు కుర్ర‌కారు పిచ్చెక్కిపోతున్నారు. న‌భాను కాస్త ప‌ట్టించుకుని ఆఫ‌ర్లు ఇవ్వ‌మంటూ కామెంట్లు చేస్తున్నారు.