శివ బాలాజీ పెళ్లి ఎలా జరిగిందో తెలిస్తే అవాక్కవుతారు..!

ప్రముఖ నటుడు శివ బాలాజీ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తన నటనతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు. ‘ఇది మా అశోక్ గాడి లవ్ స్టోరీ’ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయిన శివ బాలాజీ ‘ఎలా చెప్పను’, ‘దోస్తీ ‘ లాంటి సినిమాలలో కూడా నటించాడు. ఆ తరువాత అల్లు అర్జున్ హీరోగా వచ్చిన ‘ఆర్య’ సినిమాలో విలన్ పాత్రలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక దాని తరువాత ‘సంక్రాంతి’ సినిమాలో వెంకటేష్ తమ్ముడిగా నటించి మంచి విజయాన్ని సాధించాడు. శివ బాలాజీ తన 17 ఏళ్ళ వయసులోనే తండ్రి వ్యాపారాలను చూసుకుంటూ 22 ఏళ్ల వయసులో తన సొంతగా వ్యాపారాన్ని ప్రారంభించాడు.

శివ బాలాజీకి ఇండస్ట్రీలోకి వచ్చాక ప్రముఖ నటి మధు మితను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన ఈ ప్రేమ జంట తమ ప్రేమ, వివాహ జీవితం గురించి అభిమానులతో పంచుకున్నారు. ‘పుట్టింటికి రా చెల్లి’ అనే సినిమాతో మధుమిత తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది. ఈ సినిమా తరువాత ‘అల్లరి’ అనే సినిమాలో కూడా నటించింది మధు. ‘ఇంగ్లీష్ కారన్’ అనే సినిమాలో శివ బాలాజీ, మధు కలిసి నటించారు. ఆ సినిమా షూటింగ్ జరిగే సమయంలో వారిద్దరూ ప్రేమలో పడ్డారు. ఆ షూటింగ్‌లో శివ బాలాజీ మధుమితతో మాట్లాడడానికి ఎంతగానో ప్రయత్నించేవాడట.

ఆమెతో మాట్లాడే సమయం దొరికినప్పుడు ఫ్లర్ట్ చేసేవాడట. అలా ఇద్దరూ ప్రేమించుకోవడం స్టార్ట్ చేసారు. అదే సమయంలో ఆ సినిమాలోని ఒక సీన్ లో భాగంగా వారిద్దరూ మొదటి కిస్ పెట్టుకున్నారట. అంతే కాకుండా సీన్ లో భాగంగా వారిద్దరూ ఇంటి నుంచి లేచి పోవాలి, అప్పుడు సీన్‌లో లేకపోయినా కుడా శివ బాలాజీ మధు మితని కావాలనే కిస్ చేశాడట. అలా ప్రేమలో పడ్డ వీరు పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు.

శివ బాలాజీ బిగ్‌బాస్ 1లో విజయం సాధించడం కోసం మధుమిత చాలా కష్టపడింది. ఇక ఆ షోలో ఫ్యామిలీ ఎపిసోడ్‌లో మధుమిత హౌజ్‌లోకి వచ్చి శివ బాలాజినీ పట్టుకొని బాగా ఏడ్చేసింది. దీంతో వారిద్దరి మధ్య ఎంత ప్రేమ ఉందో అందరికీ తెలిసిపోయింది.