టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా పేరు సంపాదించుకున్న ప్రభాస్ పెళ్లి టాపిక్ ఎప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతూనే ఉంటుంది. క్యాలెండర్లు మారిపోతున్నాయి కొత్త సంవత్సరాలు వచ్చేస్తున్నాయి .. అయినా కానీ ప్రభాస్ మాత్రం మారడం లేదు. ఇండస్ట్రీకి వచ్చిన కొత్తల్లో ఈశ్వర్ సినిమాలో ఎలాంటి సిగ్గు , బిడియం తో కనిపించాడో.. నిన్నకాక మొన్న రిలీజ్ అయిన రాధేశ్యామ్ ప్రెస్ మీట్ లోను.. అంతే సిగ్గుతో ..అంతే బిడియంతో కనిపించాడు .
దీంతో ప్రభాస్ చాలా షై ఫీలింగ్ కల వ్యక్తి అంటూ జనాలు ఫిక్స్ అయిపోయారు . అయితే ఎలాంటి వాడికైనా జీవితంలో ఒక తోడు కావాలి ..ఎప్పుడో ఒకసారి పెళ్లి చేసుకోవాలి.. ప్రభాస్ కూడా అదే అంటున్నాడు. రీసెంట్గా బాలయ్య టాక్ షో కి వచ్చిన ప్రభాస్ .. తన పెళ్లిపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. పెళ్లి చేసుకుంటాను సార్.. కానీ ఆ టైం ఇంకా రాసి పెట్టలేదు అంటూ చెప్పుకొచ్చాడు .
ఒకవేళ నిజంగా ప్రభాస్ పెళ్లి చేసుకోను అని అనుకోనుంటే ..ఆ విషయాన్ని డైరెక్ట్ గా బాలయ్య షో లోనే చెప్పేసే వాడు. కానీ ప్రభాస్ పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు . అందుతున్న సమాచారం ప్రకారం ..అమ్మాయి కూడా రెడీగా ఉంది . కానీ అఫీషియల్ కన్ఫర్మేషన్ ఇంకా రాలేదు . అందుకే ఆ ఒక్క మాట చెప్పకుండా ప్రభాస్ ఆగిపోయాడు. లేకపోతే ప్రభాస్ పెళ్లి ఎవరితోనో పెళ్లి ఎప్పుడో కచ్చితంగా అన్ స్టాపబుల్ షోలో బాలయ్యతోనే రివీల్ చేయుచుండేవాడు అంటున్నారు నందమూరి ఫ్యాన్స్. దీంతో సోషల్ మీడియాలో మళ్ళీ ప్రభాస్ పెళ్లి న్యూస్ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది.