సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోలు ఎంతో మంది హీరోయిన్స్ తో జత కడుతూ ఉంటారు . కొంతమంది ఒకే హీరోయిన్ ని రిపీట్ చేసి మరి రొమాన్స్ చేస్తూ ఉంటే .. మరి కొంతమంది కొత్త కొత్త ముద్దుగుమ్మలను తెరపైకి ఇంట్రడ్యూస్ చేస్తూ .. కొత్త అందాలను ఎంజాయ్ చేస్తూ ఉంటారు . అయితే తమ మనసులో మాత్రం ఈ సినిమాలో హీరోయిన్గా ఆ హీరోయిన్ అయితే బాగుంటుంది అని కచ్చితంగా స్టార్ హీరోస్ అనుకొనే ఉంటారు. వాళ్లలో బన్నీ కూడా ఒకరు .
రీసెంట్ గా బన్నికి సంబంధించిన ఇంట్రెస్టింగ్ మ్యాటర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. డాడీ సినిమాతో గెస్ట్ రోల్గా ఇంట్రడ్యూస్ అయిన బన్నీ.. గంగోత్రి సినిమాతో హీరోగా తెలుగు చలనచిత్ర పరిశ్రమకు పరిచయమయ్యాడు. ఇక తరువాత బన్ని కెరియర్ ఎలా అప్ అండ్ డౌన్స్ తో కొనసాగిందో అందరికీ తెలిసిందే. బన్నీ ఇన్నాళ్ల తన కెరియర్లో ఎంతోమంది హీరోయిన్స్ తో నటించాడు ..అయితే మళ్లీ మళ్లీ తాను ఏ హీరోయిన్ తో నటించాలి అని కోరుకుంటున్నాడు అంటే మాత్రం ఖచ్చితంగా కాజల్ అగర్వాల్ అంటూ చెప్పుకొస్తున్నాడు .
బన్నీ ఇదే విషయాన్ని గతంలో ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టాడు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కాజల్ కాంబో గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లెదౌ. బన్నీ – కాజల్ జంట ఎంత అద్భుతంగా ఉంటుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. తెర పై నాచురల్ రొమాన్స్ తో చంపేస్తారు. ఈ క్రమంలోని ఇంకొకసారి ఈ జంట జతకడితే బాగుండు అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. చూడాలి మరి ఇద్దరిని కలిపే ఆ డైరెక్టర్ ఎక్కడున్నాడో ..ఆ సుముహూర్తం ఎప్పుడు వస్తుందో..?