టాలీవుడ్ నట సింహం నందమూరి బాలయ్య గురించి ఎంత చెప్పినా తక్కువే. చెప్పే కొద్ది ఇంకా చెప్పాలి అనిపిస్తుంది. వినే వాళ్ళకి ఇంకా కొంచెం చెప్తే బాగుండు అనిపిస్తుంది. ఎంత చెప్పినా తరగని విధంగా నందమూరి బాలయ్య ఫ్యాన్ ఫాలోయింగ్ క్రేజ్ ఉంటుంది . ప్రతిరోజు బాలయ్యకు సంబంధించిన ఏదో ఒక ఇంట్రెస్టింగ్ మేటర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటుంది . కాగా రీసెంట్గా నందమూరి బాలయ్య ..టాలీవుడ్ యంగ్ హీరో కోసం చేస్తున్న సాహసం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.
మనకు తెలిసిందే బాలయ్య ఫేవరెట్ డైరెక్టర్ ఎవరు అంటే కళ్ళు మూసుకుని టక్కున అందరు చెప్పే పేరు బోయపాటి శ్రీను . వీళ్లిద్దరి కాంబోలో పడిన ప్రతి సినిమా ఇండస్ట్రీని షేక్ చేసింది . బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలిచింది . కాగా ఇదే క్రమంలో నాలుగో సారి వీరిద్దరూ కలిసి మరో సంచలన సృష్టించడానికి సిద్ధమవుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి . అనిల్ రావిపూడి డైరెక్ట్ చేసే సినిమా పూర్తవగానే బాలయ్య మళ్ళీ బోయపాటి డైరెక్షన్లో సినిమా చేస్తున్నాడు అంటూ క్రేజీ రూమర్ వైరల్ గా మారింది.
అంతేకాదు అఖండకి సీక్వల్ గా ఈ సినిమా రాబోతుంది అంటూ కూడా తెలుస్తుంది. కాగా ప్రజెంట్ బోయపాటి శ్రీను టాలీవుడ్ యంగ్ హీరో రామ్ పోతినేని తో సినిమాను తెరకెక్కిస్తున్నాడు . కాగా ఈ సినిమాలో తన లక్కీ హీరో గెస్ట్ రోల్ గా చేస్తే సినిమాకి మరింత క్రేజ్ హైప్ వస్తుందని భావించిన బోయపాటి ..రామ్ సినిమాలో కీలక రోల్ లో బాలయ్యను దింపబోతున్నట్లు సినీ వర్గాల నుంచి సమాచారం అందుతుంది .
ఈ క్రమంలోనే ఇప్పటివరకు గెస్ట్ రోల్ చేయని బాలయ్య యంగ్ హీరో కోసం తన లక్కీ డైరెక్టర్ కోసం అలాంటి పని చేస్తున్నాడు అంటూ ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు. ఏది ఏమైనా సరే అంత పెద్ద స్టార్ హీరో..స్టార్ స్టేటస్ ఉండి కూడా ఓ యంగ్ హీరో సినిమాలో గెస్ట్ రోల్ చేయడానికి బాలయ్య ఒప్పుకున్నాడు అంటే ఆయన మంచి మనసు ఏంటో అందరికీ అర్థమయ్యే ఉంటుంది . దీంతో నందమూరి ఫ్యాన్స్ బాలయ్య దేవుడు అంటూ ట్యాగ్ చేస్తున్నారు . కాగా బాలయ్య హీరోగా.. గోపీచంద్ మల్లినేని డైరెక్టర్ గా తెరకెక్కిన సినిమా వీరసింహారెడ్డి జనవరి 12వ తేదీ గ్రాండ్గా థియేటర్స్ లో రిలీజ్ కానుంది.