హీరో సుహాస్ అంత పని చేశాడా.. భార్యను కూడా వదిలిపెట్టలేదుగా..!

చిత్ర పరిశ్రమంలోకి ఎంతోమంది హీరోలు ఉన్న రోజుకు ఓ హీరో వస్తూనే ఉంటాడు. ఈ క్రమంలోనే సినిమా పరిశ్రమంలో బ్యాక్ గ్రౌండ్ లేకుండా పరిశ్రమంలోకి వచ్చిన హీరోలని జనాలు పెద్దగా పట్టించుకోరు. అలా వారు ఏ హీరో అయినా ఇష్టపడితే మాత్రం అతని స్టార్ హీరో కన్నా సూపర్ హీరో అనే చెప్పాలి. ఇప్పుడు ఈ లిస్టులోకే వస్తాడు యువ హీరో సుహాస్.

కమీడియన్ గా టాలీవుడ్ లో తన కెరీర్‌ను మొదలు పెట్టిన సుహాస్ ఆ తర్వాత ఎన్నో సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి ప్రస్తుతం చిత్ర పరిశ్రమంలో హీరోగా సినిమాలు చేస్తూ అందర్నీ ఆకట్టుకుంటున్నాడు. సుహాస్ నటించిన కలర్ ఫోటో సినిమా ఎన్నో జాతీయ అవార్డులను దక్కించుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమా తర్వాత సుహాస్ ప‌లు సినిమాలలో హీరో పాత్రలు పోషిస్తూ తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు.

ఈ క్రమంలోనే రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నా సుహాస్ తన కెరీర్ లోని పలు ఆసక్తికర విషయాలను ఆ ఇంటర్వ్యూలో పంచుకున్నాడు. ఇక ఈ క్రమంలోనే ‘తన భార్య అంటే తనకు ఎంతో ఇష్టమని చెప్పుకొచ్చాడు. ఆయన నటించిన ఫ్యామిలీ డ్రామా సినిమా చూసి తన భార్య మూడు రోజులపాటు తన దగ్గరికి రాలేదని’.. ‘నన్ను చూస్తే భయపడి పోయి ఏడ్చుకుంటూ దూరంగా వెళ్లిపోయేదని ఆయన చెప్పుకొచ్చాడు’.

ఫ్యామిలీ డ్రామా సినిమాలో సుహాస్ సైకో పాత్రలో నటించాడు. ఆయన నటన చూస్తే ఎవరికైనా సరే నిజంగా సైకో అనే అనుమానం రాకుండా ఉండదు. ఈ సినిమా విడుదలయ్యాక సుహాస్‌ పాత్రకి ఎంతో మంచి ఆదరణ కూడా లభించింది. ఎంతలా అంటే అతని భార్య కూడా అతని సైకో అని పిలిచే అంతలా తన నటనతో అదరగొట్టాడు. ‘ఈ సినిమా దగ్గర నుంచి సుహాస్ భార్య అత‌నిసైకోని ముద్దుగా పిలిచేదట’.