బెల్లంకొండ శ్రీనివాస్.. రావడం కష్టమేనా..?

తెలుగు సినీ ఇండస్ట్రీలో నటుడు బెల్లంకొండ సురేష్ తనయుడు బెల్లంకొండ శ్రీనివాస్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. మొదట అల్లుడు శీను సినిమా ద్వారా తెలుగు సినీ పరిశ్రమకు అడుగుపెట్టిన శ్రీనివాస్ మొదటి సినిమాతోనే మాస్ హీరోగా పేరు సంపాదించారు. ఆ తర్వాత ఎన్నో భారీ బడ్జెట్ సినిమాలలో నటించారు. అయితే బెల్లంకొండ శ్రీనివాస్ కు మాత్రం సరైన సక్సెస్ రాలేదని చెప్పవచ్చు. రాక్షసుడు సినిమాలో పోలీస్ ఆఫీసర్ గా నటించిన బెల్లంకొండ శ్రీనివాస్ ఆ తర్వాత అల్లుడు అదుర్స్ సినిమాతో ఫ్లాప్ ను మూట కట్టుకున్నారు.

Chatrapathi - IMDbఇక దీంతో ఎలాగైనా సక్సెస్ కొట్టాలని టాలీవుడ్ ను వదిలి బాలీవుడ్కు వెళ్ళిపోయాడు. ఈ క్రమంలోనే ఒక మంచి కథతో సినిమా చేయాలని ప్లాన్ చేశారు. ప్రభాస్ నటించిన చత్రపతి సినిమా ఎంతటి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈ సినిమాని బాలీవుడ్ లో తీసి అక్కడ ఎంట్రీ ఇవ్వాలని చూస్తున్నారు హీరో బెల్లంకొండ శ్రీనివాస్. ఈ సినిమాను రీమేక్ చేస్తూ షూటింగ్ కూడా పూర్తి చేసుకున్నారు. అయితే ఈ చిత్రానికి దర్శకుడుగా వి.వినాయక్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలోని కొన్ని కథలలోని మార్పులు చేసి హిందీ ప్రేక్షకులకు నచ్చే విధంగా తెరకెక్కించబోతున్నట్లు సమాచారం.

ఒరిజినల్ సినిమా కంటే ఈ సినిమా సెకండాఫ్ లో కొన్ని సన్నివేశాలను ఫాస్ట్ గా నడిచే కథని మార్చేశారని కొన్ని కొత్త సన్నివేశాలను కూడా యాడ్ చేసినట్లుగా సమాచారం. ఈ సినిమా గత సంవత్సరం జనవరిలోనే షూటింగ్ ప్రారంభించగా పూర్తి అయ్యేందుకు చాలా సమయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత సినిమా విడుదల చేసేందుకు చిత్ర బృందం సిద్ధంగా ఉన్నప్పటికీ ఈ సినిమా థియేటర్లలో విడుదల చేయాలా లేకుంటే ఓటీటి లో విడుదల చేయాలనే విషయంలో సతమతమవుతున్నట్లు తెలుస్తోంది.