ఇర‌వై ఏళ్ల కుర్రాడిగా మారిపోయిన నాని.. లేటెస్ట్ లుక్ చూస్తే షాకే!

న్యాచుర‌ల్ నాని ప్ర‌స్తుతం `ద‌స‌రా` అనే సినిమాలో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. గోదావ‌రిఖ‌ని సింగ‌రేణి బ్యాక్‌డ్రాప్‌లో రూపుదిద్దుకున్న ఈ చిత్రానికి శ్రీకాంత్ ఓదెల ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. ఇందులో కీర్తి సురేష్ హీరోయిన్ గా న‌టించింది. మాస్ య‌క్ష‌న్ ఎంట‌ర్టైన‌ర్ గా రూపుదిద్దుకున్న ఈ చిత్రం మార్చి 30న పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది.

తాజాగా ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అయింది. దీంతో నాని త‌న లుక్ ను మార్చేశాడు. ద‌స‌రా సినిమా కోసం నిన్న‌టి వ‌ర‌కు మాసిన గ‌డ్డం, జుట్టుతో పూర్తి ర‌ఫ్ లుక్ లో క‌నిపించిన నాని.. తాజాగా ఇర‌వై ఏళ్ల కుర్రాడిగా మారిపోయాడు. మీసం గడ్డం తీసేసి కొత్త లుక్ లో ద‌ర్శ‌న‌మిచ్చాడు నాని. ఓ రకంగా అష్టా చమ్మా రోజులను నాని గుర్తు చేశాడని చెప్పొచ్చు.

నెట్టింట వైర‌ల్ గా మారిన నాని లేటెస్ట్ లుక్ కు నెటిజ‌న్లు షాక్ అయిపోతున్నారు. అభిమానులేమో కొత్త లుక్ సూప‌ర్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా, నాని ఇటీవ‌ల త‌న 30వ చిత్రాన్ని వైర ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో చేయబోతున్నట్టు ప్రకటించిన సంగ‌తి తెలిసిందే. ఇందులో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా న‌టించింది. ఇందులో నాని ఒక పాప‌కు తండ్రిగా క‌నిపించ‌బోతున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన ఓ క్యూట్ అండ్ స్పెషల్ వీడియోని న్యూ ఇయర్ కానుకగా విడుదల చేశారు. ఈ వీడియోలో తండ్రి – కూతుర్ల బాండింగ్ చూపించారు. అలాగే కూతురుకు నీకు గ‌డ్డం బాలేదు నాన్న అని చెప్ప‌గానే.. మ‌న సినిమాకు ఉండ‌ద‌ని నాని చెప్పాడు. ఇక చెప్పిన‌ట్లుగానే నాని ద‌స‌రా షూటింగ్ పూర్తైన వెంట‌నే క్లీన్ షేవ్ చేసుకుని ద‌ర్శ‌న‌మిచ్చాడు.