టాలీవుడ్ ప్రముఖ యాంకర్ విష్ణుప్రియ ఎప్పుడు ఏది మాట్లాడినా అది హాట్ టాపిక్ గా మారుతూనే ఉంటాయి. షార్ట్ ఫిలిమ్స్ ద్వారా తన కెరిర్ మొదలుపెట్టిన ఈ ముద్దుగుమ్మ యాంకర్ గా బుల్లితెరపై సూపర్ క్రేజ్ తో దూసుకుపోతుంది. సోషల్ మీడియాలో కూడా తన హాట్ ఫోటోషూట్స్ తో నెటిజన్లకు సూపర్ కిక్కిస్తూ ఉంటుంది. ఈ ముద్దుగుమ్మ యాంకర్ గా వచ్చిన క్రేజ్ తో పలు సినిమాల్లో కూడా నటించింది.
రీసెంట్ గా సుధీర్ హీరోగా వచ్చిన వాంటెడ్ పండుగాడు అనే సినిమాలో నటించిన విషయం తెలిసిందే. ఆ సినిమా ప్రమోషన్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న విష్ణు ప్రియను క్యాస్టింగ్ కౌచ్ గురించి అడగగా.. తాను కూడా క్యాస్టింగ్ కౌచ్ వల్ల ఇబ్బంది పడ్డాను కానీ.. నేను మాత్రం ఎలాంటి కమిట్మెంట్స్ కు ఒప్పుకోలేదని చెప్పింది. ఒకవేళ ఇరువురి మధ్య ఇష్టంతో కమిట్మెంట్ జరిగితే దాంట్లో తప్పేముంటుంది దాన్ని తప్పుగా భావించాల్సిన పనిలేదని చెప్పింది.
ఆ విషయంలో ఎవరూ అక్కడ బలవంతం అయితే చేయరు కదా ? అలాంటప్పుడు దాన్ని తప్పుగా ఎందుకు ? భావించాలి. అయితే అది ఇద్దరికీ ఇష్టం లేకుండా పని జరగటం లేదు కదా అంటూ తన మనసులోని మాటను బయటకు చెప్పుకొచ్చింది. అయితే విష్ణుప్రియ చెప్పిన దానిని బట్టి చూస్తే ఇద్దరికి ఇష్టం అయితే కాస్టింగ్ కౌచ్ విషయంలో ఎవ్వరికి ఎలాంటి ఇబ్బంది ఉండదని క్లారిటీ ఇచ్చినట్లయ్యింది.