పొట్టిపొట్టి గౌన్లతో పిచ్చెక్కిస్తున్న తమన్నా!

హీరోయిన్ తమన్నా భాటియా అందం, అభినయం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. నేటికి తమన్నా టాలీవుడ్ కి వచ్చి 17 ఏళ్ళు పూర్తవుతోంది. అయినా ఇప్పటికీ వన్నెతరగని అందంతో అమ్మడు రెచ్చిపోతోంది. కెరీర్ మొదట చిన్న, పెద్ద హీరోలతో తేడాలేకుండా నటించిన తమన్నా ఇపుడు సీనియర్ హీరోలకు ప్రత్యామ్నాయంగా మారింది. ఇన్నేళ్ల‌లో 50కి పైగా సినిమాల్లో త‌మ‌న్నా యాక్ట్ చేసింది. తెలుగుతో పాటు త‌మిళ‌, హిందీ, క‌న్న‌డ సినిమాల్లోనూ న‌టిస్తూ తన సత్తాను చాటుతోంది.

ఇక తమన్నా తెలుగులో తాజాగా నటించిన సినిమా “గుర్తుందా శీతాకాలం.” ఈ సినిమాను కన్నడ నటుడు నాగశేఖర్ దర్శకత్వం వహించగా ఈ చిత్రంలో సత్యదేవ్, కావ్యాశెట్టి, మేఘా ఆకాశ్, ప్రియదర్శి మిగిలిన ప్రధాన పాత్రల్లో నటించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈ డిసెంబర్ 9న రిలీజు కావడానికి సిద్ధమైంది. దీంతో టీమ్ ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా ప్రీరిలీజ్ ఈవెంట్’ను హైదరాబాద్‌లో నిర్వహించింది. ఈ నేపథ్యంలో అనేక విషయాలు సినిమా గురించి చిత్ర యూనిట్ తెలియజేసింది.

అసలు విషయానికొస్తే, తమన్నా ఓ వైపు సినిమాలలో నటిస్తూనే మరోవైపు సోషల్ మీడియాలో సూపర్ యాక్టివ్ గా ఉంటోంది. ఎప్పటికపుడు కొత్త ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులకు చేరువలో ఉంటుంది. తాజాగా తమన్నా చిట్టి పొట్టి గౌనులో ఫోటోలు దిగి సోషల్ మీడియాలో షేర్ చేసింది. సదరు ఫోటోలను చూసిన అభిమానులకు కంటిమీద కునుకులేకుండా పోతోంది. ఇక తమన్నా సినిమా విషయానికొస్తే, చిరంజీవి హీరోగా మెహెర్ రమేష్ దర్శకత్వంలో భోళా శంకర్ అనే సినిమాను చేస్తున్న సంగతి విదితమే.