డిఫ‌రెంట్ డ్రెస్ లో శ్రీ‌లీల టెంప్టింగ్ పోజులు.. మ‌తిపోగొట్టేసిందిగా!

యంగ్‌ బ్యూటీ శ్రీలీల గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. `పెళ్లి సందD` మూవీ తో టాలీవుడ్ కు పరిచయమైన ఈ భామ‌.. తొలి సినిమాతోనే తనదైన అందం, అభిన‌యం, చ‌లాకిత‌నంతో తెలుగు ప్రేక్షకులకు దగ్గర అయింది.

తాజాగా ఈ అమ్మడి నుంచి వచ్చిన రెండో చిత్రం ధమాకా. మాస్‌ మహారాజా రవితేజ హీరోగా త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో రూపుదిద్దుకున్న మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ఇది. ఇందులో శ్రీ‌లీల హీరోయిన్ గా న‌టించింది.

పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్స్‌పై టీజీ విశ్వ ప్రసాద్, అభిషేక్ అగర్వాల్ నిర్మించిన ఈ సినిమా డిసెంబ‌ర్ 23న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చి.. తొలి ఆట నుంచే పాజిటివ్ టాక్ ను అందుకుంది.

ఇదిలా ఉంటే.. శ్రీలీల తాజా ఫోటోషూట్ నెట్టింట‌ వైరల్ గా మారింది. డిఫ‌రెంట్ డ్రెస్ లో అందాల‌ను ఆర‌బోస్తూ టెంప్టింగ్ గా ఫోటోల‌కు పోజులు ఇచ్చింది.

ప్ర‌స్తుతం ఈ పిక్స్ కుర్ర‌కారు మ‌తులు చెడ‌గొడుతూ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారాయి. మ‌రి ఇంకెందుకు ఆల‌స్యం శ్రీ‌లీల తాజా పిక్స్ పై మీరు ఓ లుక్కేసేయండి.