`ధ‌మాకా` ట్విట్టర్ రివ్యూ.. ర‌వితేజ ఇచ్చిప‌డేశాడు అంతే!

మాస్‌ మహారాజా రవితేజ హీరోగా తెర‌కెక్కిన తాజా చిత్రం `ధమాకా`. ఇందులో శ్రీలీల హీరోయిన్ గా నటించింది. జయరామ్, సచిన్ ఖేడేకర్, తనికెళ్ళ భరణి త‌దిత‌రులు ఇందులో కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్స్‌పై టీజీ విశ్వ ప్రసాద్, అభిషేక్ అగర్వాల్ నిర్మించిన ఈ సినిమా నేడు ప్ర‌పంచ‌వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ అయింది.

మాస్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా కు పాజిటివ్ రెస్పాన్స్ వ‌స్తోంది. ఆల్రెడీ ప్రీమియర్ షోలు చూసిన వారు ట్విట్ట‌ర్ వేదిక‌గా రివ్యూలు ఇచ్చేస్తున్నారు. ఈ ఏడాది ఖిలాడి, రామారామావు ఆన్ డ్యూటీ చిత్రాల‌తో నిరాశ‌ప‌రిచిన ర‌వితేజ‌.. ధ‌మాకాతో ఇచ్చిప‌డేశాడ‌ని అంటున్నారు. స్టోరీ రొటీన్ గా ఉన్నా.. రవితేజ తన ఎనర్జీతో ప్రేక్ష‌కుల‌ను ఫుల్ ఎంట‌ర్టైన‌ర్ చేశాడ‌ని అంటున్నారు.

కామెడీ, పాటలు, ఇంటర్వెల్ బ్లాక్, క్లైమాక్స్ అదిరిపోయాయ‌ని రివ్యూలు ఇస్తున్నారు. రవితేజ కామెడీ టైమింగ్, యాక్షన్ ఎపిసోడ్స్ లో అతడి ఎనర్జీ అద్భుతం అని కామెంట్స్ చేస్తున్నారు. ధమాకా డబుల్ బ్లాక్ బస్టర్ అని ట్విట్ట‌ర్ లో రివ్యూలు ఇస్తున్నారు. మొత్తానికి ఇప్ప‌టి వ‌ర‌కు బ‌య‌ట‌కు వ‌చ్చిన టాక్ ప్ర‌కారం చూస్తే ర‌వితేజ‌కు హిట్ ప‌డ‌టం ఖాయ‌మంగా క‌నిపిస్తోంది.