త‌ల్లైనా త‌గ్గ‌ని నిషా అందాలు.. హాట్ లుక్స్ తో హీట్ పెంచిన కాజ‌ల్ చెల్లెలు!

కాజల్ అగర్వాల్ చెల్లెలు నిషా అగర్వాల్ గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. `ఏమైంది ఈవేళ` సినిమాతో కెరీర్ ప్రారంభించిన ఈ ముద్దుగుమ్మ.. సోలో, సుకుమారుడు వంటి చిత్రాలతో మంచి గుర్తింపు సంపాదించుకుంది.

అక్క కాజల్ మాదిరిగానే నిషా సైతం స్టార్ హీరోయిన్ గా ఎదుగుతుందని అందరూ భావించారు. కానీ వరుస ఆఫర్లు వస్తున్న తరుణంలో ఈ అమ్మడు అనూహ్యంగా పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమైంది. 2013లో కరణ్ అనే వ్యాపారవేత్తను నిషా అగర్వాల్ ప్రేమ వివాహం చేసుకుంది.

వీరిద్దరికీ ఒక బాబు కూడా జన్మించాడు. అయితే తలైనా నిషా అగర్వాల్ అందం ఏమాత్రం తగ్గలేదు. ఎప్పటికప్పుడు గ్లామ‌ర‌స్ ఫోటోషూట్లతో సోషల్ మీడియాలో ర‌చ్చ ర‌చ్చ చేసే నిషా.. తాజాగా మరోసారి హాట్‌ లుక్స్ తో హీట్ పెంచే ప్రయత్నం చేసింది. వజ్రాలు పొదిగిన కాస్ట్యూమ్ లో నిషా అగర్వాల్ అందంగా మెరిసిపోయింది.

డీప్ నెక్‌లో ఓవైపు ఉప్పొంగే ఎద అందాలు, మరోవైపు నాజూకు న‌డుము సొగసులను చూపిస్తూ కిర్రాక్ గా ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట తెగ వైర‌ల్ అవుతున్నాయి. నెటిజ‌న్లు నిషా అందాల‌కు ఫిదా అయిపోతున్నారు. మళ్లీ హీరోయిన్‌గా ట్రై చేయమంటూ కామెంట్లు చేస్తున్నారు.