హాట్ టాపిక్ గా మారిన విజయ్ దళపతి రెమ్యూనరేషన్..!!

కోలీవుడ్ టాలీవుడ్లో తనకంటూ ఒక ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పరచుకున్నారు నటుడు విజయ్ దళపతి. రజనీకాంత్ తర్వాత విజయ్ ది పై చేయి అంటూ వార్తలు వినిపిస్తూ ఉంటాయి. రజనీకాంత్ ఒక్కో చిత్రానికి రూ.130 కోట్ల రూపాయల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటారని ప్రచారం ఉన్నది. అటు తర్వాత స్థానంలో విజయ్ దళపతి రూ.110 నుంచి 125 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటారని కోలీవుడ్ మీడియాలో బాగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇప్పుడు తాజాగా ఈ లెక్కలు మారుతున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. విజయ్ నటించిన గత చిత్రం బీస్ట్ భారీ ఫ్లాప్ ను చూసింది.

When Thalapathy Vijay Confessed That Superstar Rajinikanth Gave Birth To  His Career - Filmibeat

అయినా కూడా రెమ్యూనరేషన్ విషయంలో ఎక్కడా తగ్గకుండా పెంచేస్తూ ఉన్నారు విజయ్ దళపతి. ప్రస్తుతం ఆయన నటిస్తున్న వారిసు చిత్రానికి గతం కంటే ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. ఈ సినిమా తెలుగులో వారసుడు పేరుతో సంక్రాంతికి విడుదల చేయబోతున్నారు. ఆ తర్వాత డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ దర్శకత్వం లో తన 67వ సినిమాని చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇక విజయ్ 68వ చిత్రానికి సంబంధించి సన్ పిక్చర్స్ నిర్మించబోతున్నట్లు కోలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా రూ.400 కోట్ల రూపాయల బడ్జెట్తో తెరకెక్కించబోతున్నట్లు సమాచారం.

WOW! Thalapathy Vijay's contribution to Superstar Rajinikanth's next movie  revealed - Tamil News - IndiaGlitz.com
ఇదే కనుక నిజమైతే విజయ్ కి ఈ సినిమా రెమ్యూనరేషన్ దాదాపుగా రూ .150 కోట్ల రూపాయలు తీసుకోబోతున్నాడనే టాక్ వినిపిస్తోంది. దీనికి యువ దర్శకుడు అట్లీ దర్శకత్వం వహిస్తున్నట్లుగా ఎక్కువగా ప్రచారం జరుగుతోంది. వీరి కాంబోలో గతంలో తేరి, మెర్సల్, బిగిల్ వంటి హ్యాట్రిక్ సినిమాలు విడుదలయ్యాయి. ప్రస్తుతం డైరెక్టర్ అట్లీ షారుఖ్ ఖాన్ నయనతార జంటగా నటిస్తున్న జవాన్ చిత్రాన్ని తెరకెక్కిస్తూ ఉన్నారు. ఈ సినిమా 2023లో విడుదల చేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది చిత్ర బృందం. ప్రస్తుతం విజయ్ రెమ్యూనరేషన్ హాట్ టాపిక్ గా మారుతోంది.