`18 పేజెస్‌` సాలిడ్ బిజినెస్‌.. హ్యాట్రిక్ హిట్ కు నిఖిల్ టార్గెట్ ఎంతంటే?

`అర్జున్ సురవరం`, `కార్తికేయ 2` వంటి సూప‌ర్ హిట్స్ అనంత‌రం యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నిఖిల్ సిద్ధార్థ `18 పేజెస్‌` మూవీతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించేందుకు సిద్ధం అవుతున్నాడు. అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ల పై బన్నీ వాసు, సుకుమార్ నిర్మించిన ఈ సినిమాకు పల్నాటి సూర్యప్రతాప్ దర్శకత్వం వహించాడు.

ఇందులో నిఖిల్ కు జోడీగా అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా న‌టించింది. రొమాంటిక్ ఎంట‌ర్టైన‌ర్ గా రూపుదిద్దుకున్న ఈ చిత్రం డిసెంబ‌ర్ 23న గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. అయితే తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్క‌లు బ‌య‌ట‌కు వ‌చ్చాయి. నిఖిల్ వ‌రుస హిట్ల‌తో దూసుకుపోతుండ‌టంతో.. ఈ చిత్రానికి సాలిడ్ బిజినెస్ జ‌రిగింది.

 

అయితే నాన్ థియేట్రికల్ రైట్స్ భారీ రేటు సొంతం అవ్వడంతో థియేట్రికల్ బిజినెస్ చాలా తక్కువే చేశారు మేక‌ర్స్‌. వ‌ర‌ల్డ్ వైడ్ గా ఈ సినిమా థియేట్రిక‌ల్ హ‌క్కులు రూ. 12 కోట్ల‌కు అమ్ముడు పోయాయి. ఏరియాల వారీగా `18 పేజెస్‌` ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్క‌ల‌ను ఓసారి గ‌మ‌నిస్తే..

నైజాం: 3.50 కోట్లు
సీడెడ్: 1.5 కోట్లు
ఆంధ్రా: 5 కోట్లు
——————————
ఏపీ+తెలంగాణ‌= 10.00 కోట్లు
——————————

క‌ర్ణాట‌క‌+రెస్టాఫ్ ఇండియా: 0.50 కోట్లు
ఓవ‌ర్సీస్‌: 1.50 కోట్లు
——————————
వ‌ర‌ల్డ్ వైడ్ బిజినెస్= 12.00 కోట్లు
——————————

కాగా, ప్ర‌పంచ‌వ్యాప్తంగా రూ. 12.00 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈ చిత్రం.. రేపు రూ.12.50 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బ‌రిలోకి దిగుతోంది. మ‌రి ఈ టార్గెట్ ను అందుకుని నిఖిల్ హ్యాట్రిక్ హిట్ కొడ‌తాడా..లేదా.. అన్న‌ది చూడాలి.