భారీగా రెమ్యున‌రేష‌న్ పెంచేసిన `కాంతార` హీరో.. ఎంతో తెలిస్తే మ‌తిపోతుంది?

కాంతార.. ఈ క‌న్నడ చిత్రం ఇండియా వైడ్ గా ఎంత‌టి సంచ‌ల‌న విజ‌యాన్ని న‌మోదు చేసిందో ప్ర‌త్యేకంగా వివ‌రించి చెప్ప‌క్క‌ర్లేదు. రిషబ్ శెట్టి హీరోగా న‌టించ‌డ‌మే కాకుండా ఈ చిత్రానికి ద‌ర్శ‌కుడిగా, ర‌చ‌యిత‌గా కూడా వ్య‌హ‌రించాడు. సప్తమి గౌడ హీరోయిన్‌గా న‌టిస్తే.. కిషోర్‌కుమార్‌, అచ్యుత్‌ కుమార్‌, ప్రమోద్‌శెట్టి త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు.

హోంబలే ఫిలింస్‌ బ్యానర్‌పై విజయ్‌ కిరగందూర్‌ నిర్మించిన ఈ చిత్రం క‌న్న‌డ‌లో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌గా నిలించింది. దీంతో ఈ చిత్రాన్ని మిగిలిన భాష‌ల్లోగా కూడా విడుద‌ల చేయ‌గా.. అన్ని చోట్ల పాజిటివ్ టాక్ తో రికార్డు స్థాయిలో వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది. ఈ సినిమాతో ఓవ‌ర్ నైట్ స్టార్ గా మారిన రిష‌బ్ శెట్టి.. కాంతార ఇచ్చిన సక్సెస్ తో త‌న రెమ్యున‌రేష‌న్ ను భారీగా పెంచేశాడ‌ట‌.

కాంతార సినిమాతో రిషబ్ శెట్టి త‌న న‌ట‌నా విశ్వ‌రూపం చూపించి ప్రేక్ష‌కుల‌ను కాకుండా విమ‌ర్శ‌కులను సైతం మెప్పించాడు. అయితే కాంతార‌కు సినిమాకు రూ. 4 కోట్ల రేంజ్ లో రెమ్యున‌రేష‌న్ అందుకున్న రిష‌బ్‌.. త‌న త‌రుప‌రి చిత్రానికి ఏకంగా రూ.50 కోట్లు రెమ్యున‌రేష‌న్ డిమాండ్ చేస్తున్నాడంటూ నెట్టింట ప్ర‌చారం జ‌రుగుతోంది. ఏదేమైనా ఒక్క సినిమా విజ‌యంతోనే ఈ రేంజ్‌లో రెమ్యున‌రేష‌న్ పెంచ‌డం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.