ఒకే వేదికపై పవన్- జగన్.. బాలయ్య స్కెచ్ మామూలుగా లేదుగా..!

నంద‌యూరి బాల‌కృష్ణ వ్యాఖ్యాత‌గా దూసుకుపోతున్న పాపుల‌ర్ టాక్‌ షో అన్‌స్టాప‌బుల్. ఈ షో తొలి సీజన్ ఇండియాలోనే నెంబ‌ర్ వ‌న్ టాక్ షోగా మంచి పాపులారిటీ ద‌క్కించుకోవ‌డంతో ఇప్పుడు రెండో సీజ‌న్ స్టార్ట్ అయింది. గత సీజన్లో ఈ షోకు కేవలం ఎంటర్‌టైన్మెంట్‌కే ఎక్కువ ప్ర‌ద‌న్య‌త ఇచ్చిన ఈ సీజ‌న్‌లో మ‌త్రం కాస్త ఘాటుగా ఉండేటట్టు పొలిటిక‌ల్ లీడ‌ర్స్ ని కూడా ఆహ్వానిస్తున్నారు. ఈ సీజన్ మొదటి షోలోనే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయ‌డు, ఆయన తనయుడు నారా లోకేష్ గెస్ట్ లుగా వ‌చ్చారు కాగా, అనంత‌రం మూడో ఎపిసోడ్‌కు మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి గెస్ట్‌లుగా వ‌చ్చారు.

Watch Unstoppable Season 2 Episode 1 on aha in HD Quality Stream Now.

ఇప్పుడు మరోసారి అన్ స్టాపబుల్ షోకి జ‌న‌సేనాని పవన్ కళ్యాణ్ రానున్నారు. బాలకృష్ణ పవన్ కళ్యాణ్ కు అషోలో 2014 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చినందుకు అయ‌న‌కు కృతజ్ఞతలు చెప్పనున్నాడని టాక్ వినిపిస్తుండగా.. 2019 ఎన్నికలలో ఓటమి తర్వాత పవన్ ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నాడని బాలయ్య ప్రశ్నించనున్నాడు..ఇక ఈ షోలో మరో విశేషమేమిటంటే పవన్ కళ్యాణ్ తో చిరంజీవితో కూడా మాట్లాడినట్లు తెలుస్తుంది.

UNSTOPPABLE 2 - EPISODE 1 Promo| NBK WITH PSPK|Balakrishna,Pawan Kalyan  |Unstoppable 2 Latest Promo - YouTube

మరో విశేషమేమిటంటే ఈ ఎపిసోడ్ లో పవన్ కళ్యాణ్ తో పాటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా సందడి చేయనట్లు తెలుస్తుంది. అయితే జగన్మోహన్ రెడ్డి రాజకీయాలకు రాకముందు బాలయ్యకు వీరాభిమాని.. అన్న విషయం అందరికీ తెలిసిందే. అదే సమయంలో సూపర్ స్టార్ కృష్ణ మరణించిన సమయంలో ఆయన భౌతిక కాయానికి జగన్మోహన్ రెడ్డి నివాళులు అర్పించడానికి వచ్చినప్పుడు అక్కడే బాలకృష్ణ కూడా ఉండడంతో ఇద్దరూ కాసేపు పలకరించుకున్నారు.

Cheap Comments On Pawan, Jagan Trolled | cinejosh.com

ఇద్దరి మధ్య ఇప్పటికీ మంచి స్నేహసంబంధం ఉన్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ వస్తున్న షోకి జగన్ ని కూడా బాలయ్య ఆహ్వానించబోతున్నట్లు టాక్ వినిపిస్తుంది. ఆ షోలో పవన్ కళ్యాణ్ మరియు జగన్ ఒకే వేదికపై కూర్చోపెట్టి ప్రస్తుత రాజకీయాలకు సంబంధించిన కొన్ని ప్రశ్నలను అడగబోతున్నారని తెలుస్తుంది. ఈ వార్త నిజమైతే మాత్రం ఎవ‌రు ఉహించ‌ని రికార్డులు క్రియేట్ అవ‌డం ఖాయం.