కెరియర్ లో ఫస్ట్ టైం అలాంటి పని చేయబోతున్న చరణ్.. మెగా అభిమానులకు బిగ్ సర్ప్రైజ్..!

ఈ సంవ‌త్స‌రం దర్శక ధీరుడు రాజమౌళి ద‌ర్శక‌త్వంలో వ‌చ్చిన త్రిబుల్ ఆర్ సినిమా ఎంత‌టి సంచ‌ల‌న విజ‌యం సాధించిందో మ‌నంద‌రికి తెలిసిందే. ఆ సినిమాతో రామ్ చ‌ర‌ణ్ కూడా పాన్ ఇండియా హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. త‌న త‌ర్వాత సినిమాను కూడా స్టార్ డైరెక్టర్ శంకర్ తో చేస్తున్నాడు.

పాన్ ఇండియా రెంజ్ లో సూప‌ర్ క్రేజ్ తెచ్చుకున్న‌ చ‌రణ్‌తో సినిమాలో చేయ‌డానికి కోలీవుడ్ నుంచి బాలీవుడ్ వ‌ర‌కు వ‌రుస డైరెక్ట‌ర్లు క్యూ క‌డుతున్నారు. తాజాగా స్టార్ డైరెక్టర్ శంకర్ తో చేస్తున పాన్ ఇండియా సినిమా నుంచి అదిరిపోయే ఆప్‌డ్ట్ వ‌చ్చింది.. ఇప్పటికే షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ ఫస్ట్ లుక్‌ పోస్టర్ గురించి ఫిల్మీ సర్కిల్లో ఓ న్యూస్ వైరల్ అవుతోంది. అందర్నీ తెగ ఆకట్టకుంటోంది.

దిల్ రాజు ప్రొడక్షన్లో స్టార్ డైరెక్టర్ శంకర్ డైరెక్షన్లో .. మెగా పవర్‌ స్టార్ చెర్రీ హీరోగా తెరకెక్కుతుండడంతో.. ఈ సినిమాపై ఎప్పటి నుంచో విపరీతమైన అంచనాలున్నాయి. అయితే ఈ అంచనాలను అందుకునేందుకు ఈ సినిమాను మరింతగా ప్రమోట్ చేసుకునేందుకు ఓ మాస్టర్ ప్లాన్ వేశారట డైరెక్టర్ శంకర్. ఈ సినిమాలోని చ‌ర‌ణ్ పస్ట్‌లుక్ పోస్టర్‌ను సంక్రాంతి రోజున విడుద‌ల చేయ‌బోతున్న‌ర‌ని తెలుస్తుంది.

శంక‌ర్- చ‌ర‌ణ్ ప‌స్ట్ లుక్ రీలిజ్ ఈ వెంట్‌ను భారీ స్థాయిలో ఎవ‌రు ఉహించ‌ని రీతితో ఓ ఈవెంట్ ప్లాన్ చేయబోతున్నాడని తెలుస్తుంది. అ ఈవెంట్‌లో ఈ సినిమా లో చ‌ర‌ణ్ లుక్ విడుద‌ల చేయ‌బోతున్న‌డాని తెలుస్తుంది. ఆ ఈవింట్ ను చుసి మెగా అభిమానులు సర్ప్రైజ్ అవుత‌రాని తెలుస్తుంది.