ముందు నేను..ఆ తర్వాతే మీ నాన్న..లైవ్ లోనే చరణ్ కు క్లాస్ పీకిన బాలయ్య..!

నట‌సింహ బాలకృష్ణ ప్రస్తుతం వ్యాఖ్యాతగా చేస్తున్న షో అన్ స్టాపబుల్… తన కెరియర్‌లో మొద‌టిసారిగా హోస్ట్ గా చేసిన షో కూడా ఇదే. సినీ సెలబ్రిటీలు పాల్గొంటున్న ఈ షో మొదటి సీజన్ ఎవరు ఊహించని సక్సెస్ అయ్యింది. ఆ సీజన్ ఇండియాలోనే నెంబర్ వన్ టాక్ షో గా పేరు తెచ్చుకుంది. ఇప్పుడు జరిగే రెండో సీజన్ కూడా మొదటి సీజన్ ను మించి దుసుకుపోతుంది. ఇప్పటికే ఆరు ఎపిసోడ్‌లు కంప్లీట్ చేసుకున్న ఈ సీజన్‌లో.. సినీ సెలబ్రిటీస్ తో పాటు పలువురు రాజకీయ నాయకులతో కూడా బాలయ్య చేసిన రచ్చ మాములుగా లేదు.

ఈ సీజ‌న్‌లో మొద‌టి ఎపిసోడ్‌లో తెలుగుదేశం అధినేత చంద్రబాబు మ‌రియు బాలయ్య అల్లుడు నారా లోకేష్, వ‌చ్చిన‌ ఈ ఎపిసోడ్ ఆహ‌లో 10 ల‌క్ష‌ల‌కు పైగా వ్యూస్‌ను రాబ‌ట్టుకుంది. అ త‌ర్వాత ఎపిసోడ్‌లో టాలీవుడ్ యువ హీరోలు వ‌చ్చి బాల‌య్య‌తో అదిరిపోయే ర‌చ్చ చేశారు. ఇక త‌ర్వాత నాలుగో ఎపిసోడ్‌లో ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్య‌మంత్రి న‌ల్లారి కిర‌ణ్ కూమ‌ర్ రెడ్డి మ‌రియు మాజీ స్పీక‌ర్ సురేష్ రెడ్డి వారితో పాటు సీనియ‌ర్‌ న‌టి రాధిక బాల‌య్య‌తో చేసిన ర‌చ్చ మాములుగా లేదు.

Prabhas With NBK | Prabhas Unstoppable 2 Episode - YouTube

ఇప్పుడు బాల‌య్య షోలో పాన్ ఇండియా హీరో ప్ర‌భాస్ సంద‌డి చేస్తోన్నాడు. ఈ షోలో కేవలం డార్లింగ్ మాత్రమే కాదు.. మ్యాచో స్టార్ గోపిచంద్ సైతం అన్ స్టాపబుల్ సీజన్ 2లో పాల్గొన్నారు. వీరి ఎపిసోడ్ డిసెంబర్ 30న స్ట్రీమింగ్ కానుండగా.. ఇప్పటివరకు విడుదలైన ప్రోమోస్‌కు సెన్సెషనల్ రెస్పాన్స్ వచ్చింది. ఇక నిన్న విడుదలైన మరో ప్రోమో కూడా ఆకట్టుకుంది. ఇక తాజా విడుద‌లైన ప్రోమోలో ప్రభాస్ అల్లరి.. గోపిచంద్, బాలయ్య కలిసి డార్లింగ్ ను టీజ్ చేయడం అభిమానులను ఆకట్టుకుంది.

Nandamuri Balakrishna Orders to Ram Charan in Prabhas Unstoppable Episode |  సంక్రాంతికి ముందు నా సినిమా చూడు.. రామ్ చరణ్‌ను బెదిరించిన బాలయ్య News in  Telugu

ఇక తాజాగా విడుదలైన ప్రోమోలో మధ్యలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు ఫోన్ చేసి ప్రభాస్‌కు సంబంధించిన సీక్రెట్స్ ను తెలుసుకునేే ప్రయత్నంలో బాలకృష్ణ- చరణ్ కు ఫోన్ చేసిన సమయంలో స్వీట్ వార్నింగ్ కూడా ఇచ్చాడు. సంక్రాంతికి వస్తున్న సినిమాలలో ముందుగా నా వీర సింహారెడ్డి సినిమాను చూడాలని.. ఆ తర్వాతే మీ నాన్న వాల్తేరు వీరయ్య సినిమా చూడాలంటూ సరదాగా స్వీట్ వార్నింగ్ కూడా ఇచ్చాడు. ఇప్పుడు ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.