సినీ ఇండస్ట్రీలో మరొక విషాదం.. నటుడు మృతి..!!

ప్రముఖ నటుడు డైరెక్టర్ వల్లబనేని జనార్ధన్ గడిచిన కొద్దిరోజుల క్రితం నుంచి అనారోగ్యంతో బాధపడుతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ రోజున అపోలో ఆసుపత్రిలో చేర్పించగా అక్కడ చికిత్స పొందుతూ మరణించినట్లుగా సమాచారం. ప్రస్తుతం ఈయన వయసు 63 సంవత్సరాలు. ప్రముఖ దర్శక నిర్మాత విజయ బాపినీడు మూడవ కూతురు లలిన్ చౌదరిని వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత వీరికి ఇద్దరు కూతుర్లు ఒక కొడుకు ఉన్నారు.

Vallabhaneni Janardhan: 'గ్యాంగ్‌లీడర్‌'లో సుమలత తండ్రి.. ఇక లేరు
ఇక అసలు విషయంలోకి వెళ్తే ఏలూరు దగ్గర పోతునూరులో వల్లభనేని జనార్ధన్ 1959 సెప్టెంబర్ 25న జన్మించారు. మొదటినుంచి సినిమాలంటే ఎక్కువగా ఆసక్తి ఉండడంతో చదువుకునే వయసు నుండి సినీ ఇండస్ట్రీ వైపు అడుగు వేశారు. అలా సొంతగా తన సంస్థను స్థాపించి మామగారి మనవరాలు పేరుతో ఒక సినిమాను మొదలుపెట్టారు. అయితే ఆ సినిమా మధ్యలోనే ఆగిపోయింది ఆ తర్వాత 21 ఏళ్ల వయసులో కనడ హిట్ సినిమా.. మానససరోవర్ ఆధారంగా చంద్రమోహన్ హీరోగా అమాయక చక్రవర్తి సినిమాను దర్శకత్వం వహించారు.

ఆ తర్వాత శోభన్ బాబు హీరోగా హిందీ బసేరాను సినిమాను తోడు నీడగా రూపొందించారు. తన కుమార్తె శ్వేతా పేరు మీద శ్వేత ఇంటర్నేషనల్ సంస్థను కూడా స్థాపించారు. దీని మీద శ్రీమతి కావాలి, పారిపోయిన ఖైదీలు వంటి చిత్రాలను తెరకెక్కించారు. శ్రీమతి కావాలి అనే చిత్రంలో ఆర్టిస్ట్ రాకపోవడంతో తనే నటుడుగా మారారు వంశీ జనార్ధన్. ఇక తన మామ విజయ బాపి నేడు తో కలిసి మహాజనానికి మరదలు పిల్ల అనే చిత్రాన్ని తెరకెక్కించారు. హీరో రవితేజ నటించిన నీకోసం సినిమాకు నిర్మాణ సామర్థ్యం వహించారు. అలా విజయ్ బాపినీడు తెరకెక్కించిన చిత్రాలలో వల్లభనేని జనార్ధన్ నటుడుగా రాణించారు. ఇక చిరంజీవితో గ్యాంగ్ లీడర్ సినిమాలో సుమలత తండ్రి పాత్రలో నటించారు. ఇక పలు సీరియల్ లో కూడా నటించారు జనార్ధన్.