ఏమాయ చేశావే.. ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండిపోయే చిత్రాల్లో ఒకటి. గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో యువ సామ్రాట్ అక్కినేని నాగచౌతన్య, సమంత జంటగా నటించారు. సమంతకు ఇదే తొలి సినిమా. 2010లో విడుదలైన ఈ చిత్రం సంచలన విజయాన్ని నమోదు చేసింది. ఈ సినిమా సమయంలో చై-సామ్ మధ్య ఏర్పడ్డ పరిచయమే ప్రేమగా మారి పెళ్లి వరకు తీసుకెళ్లింది.
కానీ, నాలుగేళ్లు గడవక ముందే ఈ జంట విడాకులు తీసుకుని ఎవరి దారి వారు చూసుకున్నారు. అయితే ఇటీవల డైరెక్టర్ గౌతమ్ మీనన్ ఏమాయ చేశావే సీక్వెల్ ను తెరకెక్కించబోతున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం స్క్రిప్ట్ పనులు జరుగుతున్నాయని, త్వరలోనే ఏమాయ చేశావే-2 సెట్స్ మీదకు వెళ్లనున్నట్లు తెలిపాడు.
అయితే ఇక్కడో సూపర్ ట్విస్ట్ ఏంటంటే.. చై-సామ్ డివోర్స్ నేపథ్యంలో `ఏమాయ చేశావే-2` కథ సాగుతుందట. నాగచైతన్య, సమంత విడిపోయిన తర్వాత వాళ్ల జీవితాలు ఎలా మారాయి అన్న నేపథ్యంలో ఏమాయ చేశావే-2 కథ సాగనుందట. అంతేకాదు, సీక్వెల్ లో రష్మిక హీరోయిన్ గా నటించబోతోందని ప్రచారం జరుగుతోంది. మరి ఈ ప్రచారం ఎంత వరకు నిజం అన్నది తెలియాల్సి ఉంది.