ఈ స్ట‌యిల్ మారాలేమో బాబూ…!

రాజ‌కీయంగా నాయ‌కుల‌కు ఒక ఇమేజ్ వ‌చ్చిన త‌ర్వాత‌.. కొంత ఇబ్బంది వ‌స్తుంది. అదేంటంటే మాస్ మ‌హారాజు మాదిరిగా ప్ర‌జ‌ల‌ను ఆక‌ట్టుకోలేక పోవ‌డం. అంతేకాదు.. ప్ర‌జ‌ల మ‌న‌సుల్లో చోటు సంపాయించుకో వ‌డం. గ‌త కొన్ని రోజులుగా టీడీపీ అధినేత చంద్ర‌బాబును ప‌రిశీలిస్తే.. ఈ రెండు స‌మ‌స్య‌లు ఆయ‌న ప్ర‌సంగాల్లో క‌నిపిస్తున్నాయి. ప్ర‌జ‌లు ఆయ‌న స‌భ‌ల‌కు వ‌స్తున్నారు. దీంతో ఆయ‌న ఉల్లాసంగా ఉన్నారు.

Politics | Chandrababu Naidu faces tough questions after defeat

ఈ క్ర‌మంలో చంద్ర‌బాబు చేస్తున్న ప్ర‌సంగాల్లో ఒకింత అగ్ర‌సివ్ నెస్ క‌నిపిస్తోంది. నేను చేశాను.. నేనే చేశాను.. అని ప‌లు మార్లు ఆయ‌న చేస్తున్న వ్యాఖ్య‌లు.. విన‌సొంపుగా ఉన్నాయ‌ని టీడీపీ నాయ‌కులు అనుకుంటే.. పొర‌పాటే. ఎందుకు చేయ‌రు..? సీఎంగా ఉండి ఆమాత్రం చేయ‌రా? అనే ప్ర‌శ్న‌లు వెంట‌నే నెటిజ‌న్ల నుంచి వ‌చ్చాయి. అంటే… కేవ‌లం త‌న‌ను తాను ప్రొజెక్టు చేయ‌డం ఫ‌లితం ఇవ్వ‌ట్లేదు.

అంతేకాదు.. ప్ర‌సంగ తీరును ప‌రిశీలించినా కూడా చంద్ర‌బాబు ప్ర‌సంగంలో ప్లీజింగ్ మ్యాన‌ర్ అనేది లేకుండా పోయింది. మీరు నాకే ఓట్లు వేయాలి.. ఎందుకు వేయ‌రు.. గ‌తంలో త‌ప్పు చేశారు.. ఇప్పుడు ఆ త‌ప్పు చేయొద్దు.. అని చంద్ర‌బాబు చెప్ప‌డం కూడా.. ఎబ్బెట్టుగానే ఉంద‌ని అంటున్నారు. ప్ర‌జ‌లు త‌ప్పు చేశార‌ని బాబు ఎలా తీర్మానం చేస్తారు? వారికి అది రైట్ అనిపించింది చేశారు.

Chandrababu Naidu To Address A Public Meeting In Telangana

ఇక, వ‌చ్చే ఎన్నిక‌ల‌కు సంబంధించి కూడా చంద్ర‌బాబు అభ్య‌ర్థించ‌డం లేదు. త‌న‌కు ఓటేయాల‌ని.. త‌న పార్టీని గెలిపించి.. త‌న‌ను సీఎం ను చేయాల‌ని.. మంచి చాన్స్ మించితే దొర‌క‌దు.. అని ఏదో.. ప్ర‌జ‌ల‌ను బ్లాక్‌మెయిల్ చేస్తున్న‌ట్టుగా ఆ వాయిస్ వినిపిస్తోంద‌ని అంటున్నారు. ప్ర‌జ‌ల మ‌ధ్య ప్లీజింగ్ మ్యాన‌ర్ ఉండాల్సిన చోట‌.. గంభీరం.. మొనాటినీ.. ప‌నికిరాద‌ని చెబుతున్నారు.