శ్రీ లీలా తెలిసి అలాంటి తప్పు చేస్తోందా..?

టాలీవుడ్ లో కేవలం ఒక్క సినిమాతో పాపులారిటీని సంపాదించుకున్న హీరోయిన్ శ్రీలీలా అంతేకాకుండా ఈ బ్యూటీ కన్నడ అమ్మాయి కూడ.ఈ ముద్దుగుమ్మకు ఇండస్ట్రీ నుంచి మంచి ఆఫర్లు అందుకుంటోంది. అంతేకాకుండా ఈమధ్య రవితేజతో ధమాకా చిత్రంలో నటిస్తోంది. శ్రీ లీలాకు అందంతో పాటు ఫిజిక్ ,స్కిన్ షో చేసిన సమయంలో చూపు తిప్పుకోనివ్వని ఆకర్షణ ఆమె సొంతం. సాధారణంగా వేరే హీరోయిన్లు మొదటి సినిమా సక్సెస్ కాకపోతే చిన్నా చితకా సినిమాలు చేసి ఆ తరువాత కనిపించకుండా పోతారు.

INTERVIEW | Expect no shades of 'KISS' in 'Bharaate', says actress Sreeleela-  The New Indian Express

ఇక సెకండ్ హీరోయిన్ పాత్రలు చేసి కొన్నాళ్ల తర్వాత కనుమరుగవటం చాలామందిని చూశాం. కానీ శ్రీలీలా అలా కాదు మొదటి సినిమా సక్సెస్ కాకపోయినా చాలా సినిమాలను తన చేతిలో పెట్టుకొని ఉంది. ఇప్పుడు తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలో కూడా చాన్సును దక్కించుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఆమె ఉన్న పొజిషన్ కి రెండవ హీరోయిన్ పాత్రలో అస్సలు అవసరం లేదని శ్రీ లీల అభిమానులు భావిస్తున్నారు. కానీ మహేష్ బాబు హీరో అని త్రివిక్రమ్ దర్శకత్వంలో వస్తున్న సినిమా అంటూ శ్రీ లీలా కమిట్ అవ్వటం అస్సలు బాగోలేదు అంటూ వార్తలు వస్తున్నాయి.

Pelli SandaD girl Sree Leela with Mahesh Babu?

ఇక శ్రీలీలా తొందరపాటు కారణంగా కెరీర్ పై ఎఫెక్ట్ పడేలా ఉంటుందని ఇండస్ట్రీ లో వార్తలు వినిపిస్తున్నాయి.. ఒక్కసారి సెకండ్ హీరోయిన్ పొజిషన్ కి వచ్చిందంటే రాను రాను అన్ని అవకాశాలు అలాగే వస్తాయి. అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. మరి త్రివిక్రమ్ సినిమా తో శ్రీ లీలాకు ఎలాంటి ఫలితాలని ఇస్తుందో చూడాలి. ఈ చిత్రంతో తన కెరియర్ టర్నింగ్ పాయింట్ అవుతుందేమో తెలియాల్సి ఉంది.