శ్రుతి హాసన్.. ఈ అమ్మడి గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. నటిగానే కాకుండా సింగర్ గానూ శ్రుతి తనకంటూ మంచి గుర్తింపు సంపాదించుకుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీగా గడుపుతోంది. తెలుగులో శ్రుతిహాసన్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కు జోడీగా `సలార్` అనే సినిమా చేస్తోంది.
అలాగే నటసింహం నందమూరి బాలకృష్ణతో `వీరసింహారెడ్డి`, మెగాస్టార్ చిరంజీవికి జోడిగా `వాల్తేరు వీరయ్య` చిత్రాల్లో నటిస్తోంది. ఈ రెండు చిత్రాలను మైత్రీ మూవీ మేకర్స్ వారే నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ రెండు చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. అలాగే శ్రుతి హాసన్ త్వరలోనే హాలీవుడ్ లోకి కూడా అడుగుపెట్టబోతోంది. అక్కడ ఈ అమ్మడు `ది ఐ` అనే లేడీ ఓరియెంటెడ్ చిత్రానికి సైన్ చేసింది. ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది.
ఇదిలా ఉంటే.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శ్రుతిహాసన్ ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకుంది. ఈ క్రమంలోనే ఆమె మ్యాజిక్ గురించి మాట్లాడుతూ.. `సంగీతం నాకు దేవుడిచ్చిన గొప్ప వరం. నా అనుభూతులన్నీ పాట ద్వారా చెప్పగలుగుతున్నా. సెలబ్రిటీ జీవితాన్ని వదిలేస్తే వ్యక్తిగతంగా మన ఆస్తిత్వం ముఖ్యమని నమ్ముతాను. అలాగే జీవితంలో ఎప్పుడూ మరొకరి నీడలో ఉండకూడదని నేను భావిస్తా. అలాంటి బతుకు నాకు వద్దు. అందుకే నటిగా, గాయనిగా ప్రత్యేకంగా ఉండేందుకు ప్రయత్నిస్తాను` అంటూ చెప్పుకొచ్చింది. దీంతో ఈమె కామెంట్స్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.