తెలుగు సినీ ఇండస్ట్రీలో గడిచిన ఐదు సంవత్సరాల క్రితం ఒక రేంజ్ లో స్టార్ హీరోయిన్ గా పేరు సంపాదించింది రకుల్ ప్రీతిసింగ్.ఈ మధ్యకాలంలో పూర్తిగా తన ఫోకస్ మొత్తం బాలీవుడ్ కె పరిమితమయ్యేలా చేసింది. హీరోయిన్గా ఈ ముద్దుగుమ్మ చేస్తున్న సినిమాలు బాలీవుడ్ లోనే ఎక్కువగా విడుదలవుతున్నాయి. ఇప్పటికి ఈమె నటించిన కొన్ని సినిమాలు విడుదలై పెద్దగా సక్సెస్ కాలేకపోతున్నాయి. అయినా కూడా వరుస అవకాశాలు వస్తున్న నేపథ్యంలో అక్కడే పర్మనెంట్ హీరోయిన్గా మారిపోయింది. సౌత్ లో ఆఫర్లు రాకపోవడం వల్లే ఇమే ఇక్కడ సినిమాలు చేయలేదని ప్రచారం కూడా ఎక్కువగా జరుగుతోంది.
ఇక అసలు విషయంలోకి వెళ్తే ఈ మధ్య సోషల్ మీడియాలో పలు పోస్టులను షేర్ చేస్తూ ఉంటుంది రకుల్. ముఖ్యంగా హాలీవుడ్ రేంజ్ లో తన అందాలను విందు చేస్తోంది. తాజాగా ఎల్లే బ్యూటీ అవార్డ్స్ వేడుకలు చాలా ఘనంగా జరిగాయి. ఈ ఏడాది వేడుకలలో రకుల్ ప్రీతిసింగ్ మోడల్ డ్రెస్ లో కనిపించి సందడి చేయడం జరిగింది. బ్యూటీ అవార్డు వేడుకలు ఈ మాత్రం బ్యూటీగా కనిపించకుండా ఎలా అన్నట్లుగా ఈమె అందాల ప్రదర్శన చేసింది దీంతో అక్కడున్న జనాలు రకుల్ ప్రీతిసింగ్ అందం గురించే మాట్లాడుకునేంతగా అందాల ప్రదర్శన చేసింది.
ప్రస్తుతం అందుకు సంబంధించి ఒక వీడియో సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతోంది. ముఖ్యంగా చాలా స్టైలిష్ మోస్ట్ మోడ్రన్ డ్రెస్సులు సందడి చేసిన ఈ ముద్దుగుమ్మ వీడియో చాలా ట్రెండీగా మారుతోంది. ముఖ్యంగా పెద్ద ఎత్తున అందాల ఆరబోతు చేసిన ఈ ముద్దుగుమ్మకు తెలుగులో ఎందుకు అవకాశాలు రాలేదని అభిమానులు సైతం కామెంట్లు చేస్తున్నారు. తిరిగి టాలీవుడ్ లో నటించాలని కోరుకుంటున్నారు అభిమానులు.
View this post on Instagram