హీరోయిన్స్ ఎంతోమంది సైతం అందంగా కనిపించడానికి ఏవేవో చేస్తూ ఉంటారు. ముఖ్యంగా పుట్టుమచ్చ అనేవి మరింత అందాన్ని కలిగిస్తుందని చెప్పవచ్చు. అలా టాలీవుడ్ లో ఎంతో మంది హీరోయిన్స్ కి పుట్టుమచ్చలు చాలా సంథింగ్ స్పెషల్ అన్నట్లుగా ఉంటాయి.వాటి గురించి ఇప్పుడు పూర్తి వివరాలు మనం తెలుసుకుందాం.
నేటితరం యువ హీరోయిన్లలో కియారా అద్వానీ గడ్డం ఎడమవైపున పుట్టుమచ్చ ఉంటుంది. ఈ రకంగా ఉన్నవారిలో ఎవరికైనా సరే.. శాస్త్రం పరంగా నిజాయితీతో ఉంటారని ఇండికేషన్. RRR సినిమా హీరోయిన్ ఆలియా భట్ కి తన నుదుటిమీద కుడివైపున ఉంటుంది.
ఇది ముద్దుగుమ్మకు చాలా అందంగా కనిపించేలా చేస్తూ ఉంటుంది. ఇలా ఉన్నవారు తాము కోరుకున్న వారిని వివాహం చేసుకుంటారు. హీరోయిన్ అనుష్క శర్మ కూడా ఆమె దవడ అంచును ఒక అందమైన పుట్టుమచ్చ ఉంది దీని అర్థం ఆప్యాయతతో కొండంత ప్రేమ చూపించడమే కాకుండా శ్రద్ధగా ఉండడం జరుగుతుంది. అనుష్క శర్మ నిర్మాతగా సక్సెస్ కావడానికి కూడా ఈ పుట్టుమచ్చలు కారణమైనట్లుగా సమాచారం.
ప్రభాస్ తో నటించిన శ్రద్ధా కపూర్ పెదవి దిగువన ఒక అందమైన పుట్టుమచ్చ ఉన్నది. ఇలా ఉన్నవారు సినీ ఇండస్ట్రీలో బాగానే కొనసాగిస్తారని శాస్త్రం సూచిస్తోందట. ఇక మరొక హీరోయిన్ కత్రినా కైఫ్ కూడా తన పెదవి పైన పుట్టుమచ్చ ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తూ ఉంటుంది.
ఈ పుట్టుమచ్చ వల్ల అందరితో కూడా మమేకమై కలిసిపోవడమే కాకుండా ఎక్కువ ఆహార ప్రియత్వాన్ని సూచిస్తుందట. ఇక నయనతార కు పుట్టుమచ్చ ఆమె అందానికి మరొక ఆకర్షనీయమని చెప్పవచ్చు. పెదవి మీదుగా ఒక పుట్టుమచ్చ తనని చాలా అందంగా చూపిస్తుంది.ఇలా ఉన్నవారు నాయకురాలు అయ్యి అవకాశం ఎక్కువగా ఉంటుందట. ఇలా ఎంతోమందికి సైతం ఈ పుట్టుమచ్చలు అదృష్టాన్ని కలిగిస్తాయని ఆస్ట్రాలజీ ప్రకారం తెలియజేయడం జరిగింది.