పరిటాల ఫ్యామిలీకి రెండు సీట్ల హామీ దక్కినట్లేనా?

వచ్చే ఎన్నికల్లో రెండు సీట్లలో పోటీ చేయాలని పరిటాల ఫ్యామిలీ గట్టిగా ట్రై చేస్తుంది..ఇప్పటికే రెండు సీట్లకు పరిటాల సునీతమ్మ, శ్రీరామ్‌లు ఇంచార్జ్‌లుగా పనిచేస్తున్నారు. ఇంచార్జ్‌లుగా పనిచేస్తున్న నేపథ్యంలో..ఆ రెండు సీట్ల నుంచి తామే పోటీ చేస్తామని శ్రీరామ్ అంటున్నారు. రాప్తాడు నుంచి సునీతమ్మ, ధర్మవరం నుంచి శ్రీరామ్ పోటీ చేయడానికి సిద్ధమవుతున్నారు. ఇప్పటికే వారు తమ తమ నియోజకవర్గాల్లో పనిచేస్తున్నారు.

అయితే రాప్తాడు సీటు ఖాయమే గాని..ధర్మవరం సీటు విషయం మాత్రం క్లారిటీ రావడం లేదు. ఇది ఇంకా పరిటాల ఫ్యామిలీకి ఫిక్స్ చేసినట్లు కనిపించడం లేదు. కానీ శ్రీరామ్ మాత్రం ధర్మవరంలో పోటీ చేసేది తానే అని చెప్పేస్తున్నారు. ఎవరు పార్టీలోకి వచ్చిన సీటు తనదే అని ప్రకటించేశారు. అంటే గత ఎన్నికల్లో ధర్మవరంలో టీడీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన వరదాపురం సూరి…తర్వాత బీజేపీలోకి వెళ్ళిపోయారు. ఇక ఆయన మళ్ళీ టీడీపీలోకి వచ్చి ధర్మవరం సీటు కోసం ట్రై చేస్తున్నట్లు తెలిసింది

ఆయన అనుచరులు ఇప్పటికే ధర్మవరం సీటు సూరిదే అని ప్రకటనలు చేస్తున్నారు. దీంతో శ్రీరామ్..ఎవరు పార్టీలోకి వచ్చిన సీటు తనదే అని చెబుతున్నారు. శ్రీరామ్ గ్రౌండ్ లెవెల్‌లో వర్క్ చేస్తున్నారు. ఇదే క్రమంలో తాజాగా సునీతమ్మ, శ్రీరామ్‌లు నియోజకవర్గ సమీక్షా సమావేశాల్లో భాగంగా చంద్రబాబుతో భేటీ అయ్యారు. ఈ క్రమంలో రెండు స్థానాలకు సంబంధించి పరిస్తుతుల ఎలా ఉన్నాయనే దానిపై బాబు ఆరా తీశారు. బాదుడేబాదుడు, పార్టీ సభ్యత్వాలు, కార్యకర్తలకు అందుబాటులో ఉండటం, ప్రజా సమస్యలపై పోరాటం చేసే అంశాలని తెలుసుకున్నారు.

ఇక రానున్న రోజుల్లో ఇదేం ఖర్మ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంతో పాటు నియోజకవర్గాల్లో మెజారిటీని పెంచుకోవాలని బాబు..సునీతమ్మ,శ్రీరామ్‌కు సూచించారు. ఇక దీని బట్టి చూస్తే పరిటాల ఫ్యామిలీకి దాదాపు రెండు సీట్లు ఫిక్స్ చేసినట్లే కనిపిస్తోంది. రాప్తాడులో సునీతమ్మ, ధర్మవరంలో శ్రీరామ్ పోటీ ఖాయమయ్యేలా ఉంది.