మెగాస్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న చిరంజీవి గురించి ఎంత చెప్పినా తక్కువే. ముఖ్యంగా ఇండస్ట్రీలోకి ఎటువంటి సపోర్టు లేకుండా వచ్చిన ఈయన అతి తక్కువ సమయంలోనే ఇండస్ట్రీకి పెద్దన్నలా మారాడు. ఈయన ఎదిగే క్రమంలో ఎన్నో అవమానాలు, అపసోపాలు పడ్డారు. వాటన్నింటినీ దిగమింగుకుని తను అనుకున్నది సాధించాడు. నటనే లక్ష్యంగా పెట్టుకున్న చిరంజీవి తన నటనతో ఇండస్ట్రీలోనే మెగాస్టార్ గా ఎదిగారు. అయితే ఎంత ఎదిగినా ఒదిగి ఉండే గుణం ఆయనది. అందుకే మెగాస్టార్ అంటే ఎనలేని అభిమానం అభిమానులకు.. అల్లు రామలింగయ్య కూతురు సురేఖను వివాహం చేసుకున్న తర్వాత చిరంజీవికి బాగా కలిసి వచ్చిందని చెప్పాలి.
ఈ దంపతులకు సుస్మిత , శ్రీజ , రామ్ చరణ్ జన్మించిన విషయం తెలిసిందే. పెద్ద కుమార్తె సుస్మిత గురించి అందరికీ తెలిసిందే. కానీ ఆమె భర్త బ్యాక్ గ్రౌండ్ గురించి పెద్దగా ఎవరికి తెలియదు. ప్రస్తుతం ఆమె చెన్నైలో స్థిరపడినట్టు .. వ్యాపార కుటుంబంలోకి కోడలిగా అడుగు పెట్టినట్లు సమాచారం. ముఖ్యంగా సుస్మిత అత్తగారి కుటుంబం రాయలసీమ నుంచి వచ్చి తమిళనాడులో స్థిరపడ్డారు. ప్రముఖ వ్యాపారవేత్త అయిన ఎల్.వి.రామారావు పెద్ద పేరు మోసిన బిజినెస్ మేన్. అప్పట్లోనే అమెరికా, థాయిలాండ్ ,సింగపూర్, జపాన్ వంటి దేశాలతో ఆయన వ్యాపార లావాదేవీలు నడిపేవారు.
అలా ఎల్వి ప్రసాద్, చంద్రిక దంపతుల కుమారుడే విష్ణు ప్రసాద్. ఈ విష్ణు ప్రసాద్ కి చిరంజీవి తన కూతురు సుస్మిత నిచ్చి వివాహం చేశారు. విష్ణు ప్రసాద్ బిజినెస్ రంగంలో అడ్మినిస్ట్రేషన్ డిగ్రీ పూర్తి చేశారు. విదేశాల్లో చదువు పూర్తయి వారి వ్యాపారాలను చూసుకుంటున్నారు. విష్ణు ప్రసాద్ తాతయ్య మొదలుపెట్టిన పామాయిల్ వ్యాపారం.. తన తండ్రి సారాధ్యంలో కొంత డెవలప్ అయింది. ఆ తర్వాత విష్ణు ప్రసాద్ బాధ్యతలు చేపట్టి ఆ వ్యాపారాన్ని ఇప్పుడు రెండింతలు చేశాడు. ప్రపంచ దేశాలకే మేలురకం పామాయిల్ ఎగుమతి చేయడం మొదలుపెట్టిన విష్ణు ప్రసాద్ ప్రస్తుతం కోటానుకోట్లకు అధిపతి.
ప్రపంచంలోనే ఇంత పేరు మోసిన వ్యక్తిని చిరంజీవి అల్లుడిగా తెచ్చుకోవడం నిజంగా గర్వకారణమని చెప్పాలి. ప్రస్తుతం ఈ జంటకు ఇద్దరు అమ్మాయిలు. సుస్మిత సినీ రంగంలో అడుగుపెట్టింది . చిరంజీవి మరియు రామ్ చరణ్ సినిమాలకు స్టైలిష్ గా వ్యవహరించడానికి కారణం కూడా ఆమె భర్త విష్ణుప్రసాద్.. భర్త ప్రోత్సాహంతోనే తనకు నచ్చిన ఫీల్డ్‌లో దూసుకుపోతోంది సుస్మిత.