నెల్లిమర్ల టీడీపీలో కొత్త ట్విస్ట్..క్యాండిడేట్ ఫిక్స్..!

తెలుగుదేశం పార్టీ కంచుకోటగా ఉన్న నెల్లిమర్లలో టీడీపీ ఇంచార్జ్ ఎవరు అనేది ఇంకా క్లారిటీ రావడం లేదు. ఎన్నికలు ముగిసి మూడున్నర ఏళ్ళు అయినా ఇంతవరకు అక్కడ ఇంచార్జ్‌ని పెట్టలేదు. దీంతో టీడీపీ క్యాడర్ డల్‌గా కనిపిస్తోంది. పైగా అక్కడ కొందరు నాయకులు సీటు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఎవరికి వారు సెపరేట్ గా కార్యక్రమాలు చేస్తున్నారు. సీనియర్ ఎమ్మెల్యే అయిన పతివాడ నారాయస్వామికి వయసు మీద పడటంతోనే ఇక్కడ కొత్త అభ్యర్ధి కోసం వెతుకులాట మొదలైంది.

ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన పతివాడ..గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత ఇంకా తాను రాజకీయాల్లో ఉండలేనని చెప్పి సైడ్ అయ్యారు. దీంతో నెల్లిమర్లలో టీడీపీని తారక రామ నాయుడు నడిపిస్తూ వస్తున్నారు. ఇదే క్రమంలో మాజీ ఎంపీపీ బంగార్రాజు సైతం ఇక్కడ యాక్టివ్ గా పనిచేయడం మొదలుపెట్టారు. నెల్లిమర్ల సీటు కోసం ఆయన గట్టిగా ట్రై చేస్తున్నారు. అటు మరో నేత ఆనంద్ కుమార్ సైతం నెల్లిమర్ల సీటుపై ఫోకస్ చేశారు. ఇలా ముగ్గురు నేతలు ఎవరికి వారు సెపరేట్ గా రాజకీయం చేస్తున్నారు.

ఇక్కడ ముగ్గురుకు మంచి బలం ఉంది..బలమైన ఫాలోయింగ్ ఉంది..ఆర్ధికంగా కూడా స్ట్రాంగ్ గానే ఉన్నారు. దీంతో టీడీపీ అధిష్టానం ఈ ముగ్గురులో ఎవరికి ఇంచార్జ్ పదవి ఇవ్వాలనే దానిపై సర్వే చేసింది. ఈ సర్వేలో పతివాడ మనవడు, బంగార్రాజు పోటాపోటిగా కనిపించారు. అలాగే ముగ్గురు నేతలని టీడీపీ పెద్దలు వన్ బై వన్ సమావేశమై..ఇంటర్వ్యూలా చేశారు. అయితే ఈ పరిణామాల క్రమంలో బంగార్రాజుకు కాస్త అవకాశాలు ఉన్నాయని ఆ మధ్య ప్రచారం జరిగింది.

ఆయనకే నెల్లిమర్ల సీటు ఇస్తారని చర్చ నడిచింది..కానీ ఇటీవల సర్వేల్లో బంగార్రాజుకు అంత అనుకూలమైన వాతావరణం లేదని తేలింది. దీంతో అధిష్టానం ఆలోచనలో పడిందట. బంగార్రాజుకు కేవలం రెండు మండలాల్లోనే బలం కనిపిస్తుంది. దీంతో అధిష్టానం మళ్ళీ పతివాడ ఫ్యామిలీ వైపు చూస్తుందని తెలుస్తోంది. ఇక ఫైనల్‌గా సర్వే చేసి..డిసెంబర్‌లో కొత్త ఇంచార్జ్‌ని పెట్టనున్నారట.