మొన్న ఎన్టీఆర్ అన్నది తప్పయితే… ఇప్పుడు బాలకృష్ణ చేసింది కూడా తప్పే..!?

నందమూరి కుటుంబం గురించి తెలుగు ప్రజలకు ప్రత్యేకంగా పరిచయం చేయనవసరం లేదు. ఆ కుటుంబం నుంచి సినిమాల్లోకి వచ్చిన ఏ హీరో ఏది మాట్లాడినా అది పెద్ద సంచలనమే అవుతుంది. మరి ముఖ్యంగా బాలకృష్ణ- యంగ్ టైగర్ ఎన్టీఆర్ గానీ తెలుగుదేశం పార్టీ గురించి కానీ వైసీపీ గురించి కానీ ఏది మాట్లాడిన అది పెద్ద ఇంట్రెస్టింగ్ గానే మారుతూనే ఉంటుంది. జూనియర్ ఎన్టీఆర్ టిడిపి బాధ్యతలు తీసుకుంటాడో లేదో అనేది ఇప్పటికీ ఒక తెలియని ప్రశ్నలాగా మారింది. ఈ విషయం పక్కన పడితే నందమూరి కుటుంబంలో ఏ చిన్న సమస్య వచ్చినా కుటుంబం మొత్తం ఓకే తాటి పైకి వచ్చి ఆ సమస్యను ఎదుర్కొంటారు. ఆ కుటుంబంపై ఎవరు విమర్శలు చేసినా అందరూ ఒకే మాట మీద ఉండి వాటిని ఖండిస్తారు. జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చిన సమయంలో కూడా కుటుంబం మొత్తం ఆ విషయంపై స్పందించారు.

ఆ సమయంలోనే జూనియర్ ఎన్టీఆర్ ఆ విషయంపై చేసిన వ్యాఖ్యాలు ఎన్నో చర్చలకు దారితీసాయి. ఎన్టీఆర్ పేరు తీసేసి వైయస్సార్ పేరు పెడితే… ఆయన గౌరవం పెరగద‌ని చురకలు అంటించారు.. ఎన్టీఆర్, వైయస్సార్ ఇద్దరూ ప్రజాధరణ సంపాదించుకున్న గొప్ప నాయకులు.. ఈ రకంగా ఒకరు పేరు తీసి మరొకరు పేరు పెట్టడం ద్వారా వారికి ఇచ్చే గౌరవం వారి స్థాయిని పెంచదు,ఎన్టీఆర్ స్థాయిని తగ్గించదన్నారు జూ.ఎన్టీఆర్. యూనివర్సిటీ పేరు మార్చడం వల్ల ఎన్టీఆర్ సంపాదించుకున్న కీర్తి, తెలుగు జాతి చరిత్రలో వారి స్థాయిని తెలుగు ప్రజల హృదయాల్లో ఉన్న వారి జ్ఞాపకాలను ఎవరు తుడిచి వేయలేరని ఆయన చెప్పుకొచ్చాడు. ఆ టైంలో జూ.ఎన్టీఆర్ ఇలా ఇంత ప్రశాంతంగా చెప్పడం ప్రధానంగా ఎన్టీఆర్ మాట్లాడిన‌ మాటల్లో వైయస్సార్ ని ప్రశంసించడానికే ఎక్కువ ప్రయత్నించారని.. ఎన్టీఆర్ కన్నా అభిమానులు గట్టిగా ప్రశ్నిస్తున్నారంటూ ఆయనను విమర్శించారు.

If NTR Is Wrong, Balayya's Is Blunder!

ఎన్టీఆర్ విషయం పక్కనపడితే.. ఇప్పుడు బాలకృష్ణ సైతం వైయస్ రాజశేఖర్ రెడ్డిని పొగడ్తలతో ముంచేశాడు.. ఈ మాటలు టిడిపి నేతలకు గానీ నందమూరి అభిమానులకు కానీ ఇవి రుచించటం లేదట. రీసెంట్గా రిలీజ్ అయిన అన్ స్టాపబుల్ ప్రోమోలో బాలయ్య వైఎస్సార్ గ్రేట్ లెజెండ్‌ను మిస్ అయ్యామని చెప్పుకొచ్చాడు. ఇప్పుడు బాలయ్య అన్న మాటలను గౌరవం కొద్దీగా అన్నారని కొందరు అంటున్నారు. అయితే మరి కొందరు జూ.ఎన్టీఆర్‌ను ట్రోల్ చేసిన వారు కూడా గౌరవం కోద్దీ అనుకోవచ్చు కదా… బాలకృష్ణ దగ్గరకు వచ్చే అప్పటికి గౌరవం అయింది.. ఎన్టీఆర్ అప్పుడు అన్న మాటలకు ఎంతలా ట్రోల్ చేశారని ఎన్టీఆర్ అభిమానులు ఎంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

అప్పుడు ఎన్టీఆర్ పై విమర్శలు చేసిన వాళ్ళు ఇప్పుడు ఏ విధంగా స్పందిస్తారో చెప్పండి అంటూ అడుగుతున్నారు. ఈ విషయాలన్నీ పక్కన పెడితే రాజకీయాలలో చనిపోయిన వారి గురించి నెగటివ్గా మాట్లాడటం అంత మంచిది కాదు అందుకే చంద్రబాబు కూడా వైయస్సార్ గురించి ఎంతో పాజిటివ్గా మాట్లాడారు బాలయ్య కూడా అదే పద్ధతిని ఫాలో అవుతున్నారని మరికొందరు భావిస్తున్నారు. ఇదంతా కరెక్ట్‌ అయినప్పుడు ఎన్టీఆర్ చేసిన వ్యాఖ్యలు కూడా అంతే పాజిటివ్గా తీసుకోవాలి కానీ అప్పుడు ఎన్టీఆర్‌ను అంత విపరీతంగా ట్రోల్ చేశారు అంటూ ఎన్టీఆర్ అభిమానులు అలా ట్రోల్ చేసిన వారిని ప్రశ్నిస్తున్నారు.

Share post:

Latest