హవ్వ..ఏంటి ఈ ఛండాలం..కొత్త జబర్దస్త్ యాంకర్ పై హైపర్ ఆది పచ్చి బూతు కామెంట్..!!

టెలివిజన్ రంగంలో జబర్దస్త్ షో ఎలాంటి క్రేజ్ ని, పాపులారిటీని దక్కించుకుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు . టెలివిజన్ చరిత్రలోనే ఫస్ట్ టైం కమెడియన్స్ తో స్కిట్స్ వేయించి ఒక కామెడీ షో కి పునాది వేసింది . కాగా షో స్టార్ట్ అయ్యి దాదాపు పది సంవత్సరాలు కావస్తున్నా సరే ..జబర్దస్త్ షో టాప్ టిఆర్పి రేటింగ్స్ తో నెంబర్ వన్ పొజిషన్లో ఉంది. కాగా జబర్దస్త్ టీఆర్పీలు నెంబర్ వన్ రేంజ్ లో ఉండడానికి మెయిన్ రీజన్ హైపర్ ఆది వేసే డబల్ మీనింగ్ పంచెస్ అంటూ జనాలు చెప్పుకొస్తున్నారు.

కరెక్టే ఫ్యామిలీ మొత్తం కలిసి జబర్దస్త్ అనే షో ని చూడలేరు. వాళ్ళు మాట్లాడే వల్గర్ మాటలు ..డబల్ మీనింగ్ బూతు పదాలను.. చిన్నపిల్లలు వింటే చెడిపోయే ప్రమాదం ఉంది. కానీ యువత మాత్రం ఫోన్లో యూట్యూబ్ లో స్కిట్స్ చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. కాగా రీసెంట్గా జబర్దస్త్ కు సంబంధించిన ప్రోమోను రిలీజ్ చేశారు మల్లెమాల . ఈ క్రమంలోనే హైపర్ ఆది మళ్ళీ తనలోని రసికుడను బయటకు తీసుకొస్తూ కొత్త యాంకర్ సౌమ్య పై పచ్చి బూతు కామెంట్ చేశాడు . దీంతో ఈ ప్రోమో నెట్టింట వైరల్ గా మారింది .

ప్రోమో ఆధారంగా స్కిట్లో భాగంగా హైపర్ ఆది తనదైన స్టైల్ లో నవ్విస్తాడు. యాంకర్ పై పంచెస్ వేస్తూనే తన టాలెంట్ ను బయటకు తీసుకొస్తూ కడుపుబ్బ నవ్వించడానికి ట్రై చేశాడు . ఈ క్రమంలోనే జడ్జి కృష్ణ భగవాన్ ఈ ప్రపంచంలో అందరూ మరణించేసి మీరు మాత్రమే ఉంటే ఏం చేస్తారో అన్న కోణంలో సౌమ్యను లాక్కొచ్చాడు. దీంతో హైపర్ ఆది ఆమె ఫీలింగ్స్ అర్ధం చేసుకోకుండా.. మేమిద్దరం కలిసి ఒక ప్రపంచాన్ని సృష్టిస్తాం .. వరుసగా ఒకరి తర్వాత ఒకరిని కంటూనే ఉంటాం అంటూ పర్సనల్ మ్యాటర్ ని పబ్లిక్ గా మాట్లాడాడు . దీంతో హైపర్ ఆది కామెంట్ కి ఎలా స్పందించాలో కూడా తెలియక సౌమ్య ఇబ్బందికరంగా సిగ్గుతో ..నవ్వుతూ లైట్ తీసుకుంది . కానీ ఆమె మనసులోని ఫీలింగ్ ఫేస్ లో స్పష్టంగా అర్థం అయిపోయింది . ఇలాంటి చెత్త జోక్ ఎలా వేస్తావు.. అని తిట్టుకునేలా ఉంది . దీంతో జబర్దస్త్ లేటెస్ట్ ప్రోమో వైరల్ గా మారింది. ఆదికు ఇలాంటి కామెంట్స్ కొత్త కాదు గతంలో రష్మి, సుధీర్ పై ఇలాంటి చెత్త డబుల్ మీనింగ్ డైలాగ్స్ తో పంచెస్ వేసే విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ లిస్టులోకి యాడ్ అయింది కొత్త యాంకర్ సౌమ్య..!!