కండక్టర్ అవుదామనుకుని హీరో అయిన విజయ్ దేవరకొండ.. ఈ సీక్రెట్ మీకు తెలుసా?

విజయ్ దేవరకొండ హీరోగా డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ డైరెక్షన్లో తరికెక్కిన `లైగర్` సినిమా పాన్ ఇండియా బరిలోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చి బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ ఆయి కూర్చుంది. ఈ సినిమా పరాజయం పొందినప్పటికీ విజయ్ పాన్ ఇండియా క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. విజయ్ తాజాగా శివ నిర్మాణ దర్శకత్వంలో వస్తున్న `ఖుషి` సినిమాలో హీరోగా నటిస్తున్నాడు.

మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన సమంత నటిస్తుండగా.. ఇతర ప్రముఖ పాత్రలలో జయరామ్, సచిన్ ఖడేకర్, ఆలీ, వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ తదితరులు నటిస్తున్నారు. అయితే తాజాగా అందిన సమాచారం ప్రకారం ఖుషి సినిమా తర్వాత విజయ్ త్రివిక్రమ్ కథతో ఓ సినిమా చేయనున్నారని తెలుస్తుంది.

ఇటీవల జరిగిన ఓ ప్రోగ్రాం లో భాగంగా విజయ్ రాపిడ్ ఫైర్ లో పాలుపంచుకున్నాడు. ఆ క్రమంలోనే విజయ్ తనకు పాములంటే భయమని.. చిన్నప్పుడు బస్ కండక్టర్ కావాలనుకునే వాడిని అని కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను చెప్పుకొచ్చాడు. విజయ్ బస్ కండక్టర్ అవుదామని హీరో అయ్యాడని సీక్రెట్ బయటపెట్టాడు. అంతేకాకుండా తనకు డ్రీమ్ రోల్ గ్లాడియేటర్ అని కూడా చెప్పుకొచ్చాడు. ఇదిలా ఉండగా పూరితో మరో సినిమాను విజయ్ త్వరలోనే మొదలుపెట్టనున్నాడు. పూరి డైరెక్షన్లో విజయ్ హీరోగా `జనగణమన` పేరిట మరో భారీ పాన్ ఇండియా సినిమా తెరకెక్కనున్న విషయం మనందరికీ తెలిసిందే. ప్రస్తుతం విజయ్ బయటపెట్టిన ఇంట్రెస్టింగ్ విషయాలు వైర‌ల్ గా మారాయి.