ఇంద్ర భ‌వ‌నం లాంటి సొంత ఇల్లు ఉన్నా అద్దెకు ఉంటున్న స్టార్స్ వీళ్లే!

సొంతిల్లు.. చాలామందికి ఉండే కల. ఆ కలను నెరవేర్చుకోడానికి ఎంతగానో ప్రయత్నిస్తుంటారు. ఇక సెలబ్రిటీలు అయితే కోట్లకు కోట్లు ఖర్చుపెట్టి మరి ఇంద్రభవనం లాంటి ఇళ్ళను నిర్మించుకుంటారు. అయితే కొందరు సెలబ్రిటీలు మాత్రం అంత ఖర్చు పెట్టి కట్టుకున్న సొంత ఇంటిని వదిలి అద్దె ఇళ్లల్లో ఉంటున్నారు. అంత ఖరీదైన భవనాలు వదిలి అద్దె కుంటున్న ఆ టాలీవుడ్ సెలబ్రిటీలెవరో ఇప్పుడు తెలుసుకుందాం.‌

మహేష్ బాబు: సూపర్ స్టార్ మహేష్ బాబుకి హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ లో అత్యంత విలువచేసే పెద్ద భవనం ఉంది. కానీ మన సూపర్ స్టార్ మాత్రం అందులో ఉండకుండా నగరంలోని ఓ కాలనీలో త్రిబుల్ బెడ్ రూమ్ ఫ్లాట్ తీసుకుని అక్కడే ఫ్యామిలీతో ఉంటున్నాడు. అయితే మహేష్ బాబు ఎదురింట్లోనే ఆమె సోదరి కూడా ఉంటున్నారట.

పవన్ కళ్యాణ్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా నందగిరిలో ఒక పెద్ద స్వగృహం ఉంది. అయినప్పటికీ పవన్ కళ్యాణ్ ఆ ఇంటిని వదిలి అతని ఫామ్ హౌస్ లో నివాసం ఉంటున్నాడు.

నాగచైతన్య: అక్కినేని నాగార్జున కుమారుడు నాగచైతన్య కూడా అబిడ్స్ మాల్ వద్ద ఉండే నార్మల్ ఫ్లాట్ లో నివాసము ఉంటున్నాడు. అయితే నాగచైతన్య రెండో సినిమా నుంచి ఆ ఇంటికి షిఫ్ట్ అయ్యాడట. నాగచైతన్య అక్కడ ఉండడానికి గల ప్రధాన కారణం ఏమిటంటే.. ఆయన తల్లి దగ్గుపాటి లక్ష్మి ఆ ఇంటికి ఇంటీరియర్ డిజైన్ చేసిందన్న సెంటిమెంట్ వల్లే ఆ ఇంటిని వదలకుండా అక్కడే ఉంటున్నాడ‌ని సమాచారం. సమంతతో పెళ్లి అయిన తర్వాత కూడా తన భార్యతో కలిసి అక్కడే కాపురం ఉన్నాడు.

రాజమౌళి: దర్శక ధీరుడు రాజమౌళి తన పెళ్లయినప్పటి నుండి మణికొండ లోనే కాపురం ఉంటున్నాడు. గతంలో రాజమౌళి ఓ ఖరీదైన విల్లాలో ఉండేవారు. కానీ ఆ తర్వాత ఆ ఇంటిని అద్దెకు ఇచ్చి.. మణికొండ లోనే త్రిబుల్ బెడ్ రూమ్ ఫ్లాట్ లో నివసిస్తున్నాడు.

జగపతిబాబు: జగపతిబాబు నగరంలోని అపోలో ఆసుపత్రికి దగ్గరలో ఒక పెద్ద ఖరీదైన భవనం ఉంది. అయినప్పటికీ ఆయన ఆ ఇంటిలో నివసించడం లేదు. ప్రస్తుతం కూకట్ ప‌ల్లిలోని ఒక అద్దె ఫ్లాట్ లో ఉంటున్నాడు.