రిషబ్ శెట్టి .. ఈ పేరు కొన్ని వారాల ముందు వరకు తెలుగు ప్రజలకు పెద్దగా పరిచయం లేదు. ఒకే ఒక్క సినిమాతో ఇతని పేరు పాన్ ఇండియా లెవెల్ లో మారుమోగిపోతుంది. దానికి బిగ్..బిగ్గర్.. బిగ్గెస్ట్ రీజన్ కాంతారా సినిమా. ఈ సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడమే . ఎస్ సెప్టెంబర్ 30న కన్నడలో రిలీజ్ అయిన కాంతారా సినిమా ఎలాంటి హ్యూజ్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు .
కన్నడ నేటివిటికి చాలా దగ్గరగా ఉండడం.. ప్రతి పాయింట్ క్షుణ్ణంగా పరిశీలించి డైరెక్ట్ చేయడంతో ఈ సినిమా జనాలకు బాగానే నచ్చేసింది. దీంతో ఓ రేంజ్ లో ఈ సినిమాని ప్రమోట్ చేశారు జనాలు. ఈ క్రమంలోనే తెలుగులో కూడా ఈ సినిమా డబ్ అయింది. కాగా ఎవరు ఊహించిన విధంగా తెలుగులో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది కాంతారా. ఈ క్రమంలోనే రిషెబ్ శెట్టి పేరు ఓ రేంజ్ లో వైరల్ గా మారింది. కాగా సినిమా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న కాంతారా డైరెక్టర్ హీరో రిషబ్ శెట్టి రీసెంట్గా ఇచ్చిన ఇంటర్వ్యూలో సంచలన ప్రకటన చేశారు . దీంతో ఆయన తెలుగు ఫ్యాన్స్ బాధపడిపోతున్నారు.
రిషబ్ శెట్టి ఆ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ..”సినిమా సక్సెస్ అయినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇంత సక్సెస్ అవుతుందని మేము అనుకోలేదు. కష్టానికి తగ్గ ప్రతిఫలం దక్కినందుకు చాలా హ్యాపీ. ఎక్కడికి వెళ్లిన నన్ను అందరూ ఒకటే ప్రశ్న అడుగుతున్నారు . కేవలం కన్నడలో చేస్తారా మిగతా భాషలో సినిమాలు చేయరా..? హీరోగా కానీ డైరెక్టర్గా కానీ చేయండి.. అంటూ రిక్వెస్ట్ చేస్తున్నారు . కానీ నేను ఎప్పటికి పక్క భాష సినిమా ఇండస్ట్రీలో నటించను, కన్నడలో సినిమాలు చేసి తెరకెక్కించి ఆ సినిమాలను డబ్ చేస్తానే కానీ నేను డైరెక్టర్గా పక్క భాష ఇండస్ట్రీ జోలికి వెళ్ళను “అంటూ చెప్పుకొచ్చారు. దీంతో రిషప్ శెట్టి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.