కాంతారా సినిమా హీరోయిన్ గురించి తెలియని విషయాలు ఇవే..!!

ప్రస్తుతం సినీ వర్గాల ప్రేక్షకులకు ఈ మధ్య బాగా వినిపిస్తున్న పేరు కాంతారా. ఈ సినిమా గురించి కొన్ని విషయాలు జోరుగా చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఈ చిత్రంలో హీరోగా రిషబ్ శెట్టి, హీరోయిన్గా సప్తమి గౌడ నటించారు. ఈ చిత్రానికి ఈ ఇద్దరు పూర్తిస్థాయిలో న్యాయం చేశారని చెప్పవచ్చు. కాంతర సినిమా సక్సెస్ సాధించడంతో రిషబ్ శెట్టి తో పాటు సప్తమి గౌడ కూడా ఇతర భాషల నుంచి పలు ఆఫర్లు వస్తూ ఉన్నాయి. అయితే ఇందులో నటించిన ఈ హీరోయిన్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం.

kantara movie: 'Popcorn Monkey Tiger' fame with coastal girl in 'Kantara' -  popcorn monkey tiger fame sapthami » Jsnewstimes

కాంతారా సినిమా సక్సెస్ కావడంతో పాన్ ఇండియా హీరోయిన్గా కూడా గుర్తింపు సంపాదించుకుంది సప్తమి గౌడ. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కాంతారావు మూవీ కోసం తనను సంప్రదించిన సమయంలో ఈ సినిమా కథ పాత్రలకు సంబంధించి తనకు ఏమీ తెలియదని తెలియజేసింది. కానీ నాపై నమ్మకం ఉండడంతో రిషబ్ శెట్టి తనకు ఈ సినిమా అవకాశాన్ని ఇచ్చారని సప్తమి గౌడ తెలియజేసింది. అందుకు ఆయనకు ధన్యవాదాలు చెబుతున్నారని తెలియజేసింది.

Kantara: ಕಾಂತಾರ ಕ್ಲೈಮ್ಯಾಕ್ಸ್​​ ನೋಡ ನೋಡುತ್ತಲೇ ದೈವ ಆವಾಹನೆ, ಥಿಯೇಟರ್‌ನಲ್ಲೇ ಓ  ಎಂದು ಆರ್ಭಟಿಸಿದ ಮಹಿಳೆ!

ఇతర భాషలను సినిమా ఆఫర్లు వస్తే ఏమాత్రం ఇబ్బంది లేకుండా నటిస్తానని తెలియజేసింది. ఇక సప్తమి గౌడ వ్యక్తిగత విషయానికి వస్తే 1996 జూన్ 8వ తేదీన బెంగళూరులో జన్మించిందట. ఇక తన తండ్రి కూడా ఒక అసిస్టెంట్ కమిషనర్ పోలీస్ గా పనిచేశారట. ఇమే సివిల్ ఇంజనీరింగ్ కూడా పూర్తి చేసింది. తన మొదటి చిత్రం పాప్ కార్న్ మంకీ టైగర్ వంటి సినిమాలో నటించిన పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. తన రెండవ సినిమా కాంతారా తో మంచి పాపులారిటీ సంపాదించుకుంది. అంతేకాకుండా ఈమె నేషనల్ వైడ్ గా కూడా స్విమ్మర్ గా పేరుపొందింది. ప్రస్తుతం ఈమెకు సంబంధించి ఈ విషయం కాస్త వైరల్ గా మారుతోంది.