సురేఖ‌వాణికి ఛాన్సులు లేకుండా తొక్కేస్తోన్న టాలీవుడ్ ప్ర‌ముఖులు ఎవ‌రు..?

టాలీవుడ్ లో క్యారెక్టర్ ఆర్టిస్టుల్లో ఒకరైన సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖవాణి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయక్కర్లేదు. గత కొన్ని సంవత్సరాలుగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఫుల్ బిజీగా ఉంటోంది సురేఖ వాణి. గత కొంతకాలం నుండి సురేఖ వాణి సినిమాలకు కొంత దూరంగా ఉంటుంది. ఆమెసినిమాలలోనే కాకుండా సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్గా ఉన్నా సినిమాల్లో ఎందుకు నటించడం లేదని ఆమె అభిమానులు కొంత ఆవేదనకు గురవుతున్నారు. సురేఖ వాణి తన సినిమా ఆఫర్ల గురించి స్పందిస్తు కొన్ని షాపింగ్ కామెంట్‌లు చేసింది. ఆ కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

తాజాగా రిలీజ్ అయిన స్వాతిముత్యం సినిమాలో సురేఖ వాణి కీలకపాత్రలో నటించింది. ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతుంది. సినిమాకు సూపర్ హిట్ టాక్ రావడంతో సినిమా యూనిట్ సక్సెస్ మీట్ నిర్వహించింది. ఈ సక్సెస్ మీట్ లో సురేఖ వాణి మీడియా వాళ్లతో మాట్లాడుతూ…’ నేను ఈ మధ్యకాలంలో నేను సినిమాలలో నటించకపోవటానికి ముఖ్య కారణం ఇండస్ట్రీలో కొందరు నాకు సినిమా అవకాశాలు రాకుండా చేస్తున్నారు. దానివల్ల నాకు సినిమా అవకాశాలు రావట్లేదని అంటూ సురేఖ వాణి కొంత ఎమోషనల్ అయ్యారు.

Actress Surekha Vani Emotional Speech At Swathi Muthyam Success Meet | Hero Ganesh | Around Telugu - YouTube

టాలీవుడ్ లో నాకు కొందరు కావాలని సినిమా అవకాశాలు ఇవ్వటం లేదని సురేఖ వాణి తెలిపింది. నేను సినిమాలు మానేయలేదు.. సినిమా అవకాశాలు వస్తే నటిస్తానని ఆమె చెప్పుకొచ్చింది. స్వాతిముత్యం సినిమాలో నాకు అవకాశం ఇచ్చిన సినిమా యూనిట్ కి కృతజ్ఞతలు చెప్పింది సురేఖవాణి. సురేఖ వాణి చేసిన కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

నటి సురేఖ వాణి భావోద్వేగం.. భర్తతో గడిపిన చివరి క్షణాలను గుర్తుచేసుకుని..

సురేఖ వాణికి అవకాశాలు రానికుండా చేసింది ఎవరు అంటూ… ఆమెకి ఎందుకు అవకాశాలు రాకుండా చేస్తున్నారంటూ.. అమె అభిమానులు సోషల్ మీడియా ద్వారా కామెంట్లు పెడుతూ.. ఆమెకు స‌పోర్ట్ చేస్తూ త‌మ‌ అభిమానాన్ని చాటుకుంటున్నారు. సినిమా అవకాశాలు తెచ్చుకుని వరుస సినిమాలతో బిజీ అవ్వాలని అమె అభిమానులు కోరుకుంటున్నారు.