పడుకుంటే డబ్బులు ఇస్తానంటూ వచ్చిన ఆ డైరెక్టర్ బండారాన్ని బయటపెట్టిన శ్వేత వర్మ..!!

ఏ ఇండస్ట్రీలో నైనా క్యాస్టింగ్ కౌచ్ భూతం అనేది చాలా కామన్ గా మారిపోయింది. మీటూ ఉద్యమం వచ్చినప్పుడు ఈ విషయం మరింత రచ్చ రచ్చగా మారిపోయింది. అయితే ఇప్పుడు క్యాస్టింగ్ కౌచ్ ఉందో లేదో తెలియదు కానీ ఇప్పటికి ఎంతోమంది సెలబ్రెటీలు సైతం తమ కాస్టింగ్ కౌచ్ బారిన పడ్డామని తెలియజేస్తూ ఉన్నారు. ఇలాంటి అనుభవాన్ని ఎదుర్కొన్నట్లు బిగ్ బాస్ శ్వేతా వర్మ తెలియజేస్తోంది. వాటి గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

Swetha Varma (Bigg Boss Telugu) - Wiki, Age, Family, Biography & More!
తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న శ్వేత వర్మ.. క్యాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడుతూ.. దీనివల్ల చాలా రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొన్నానని తెలియజేసింది. గతంలో తనకు జరిగిన కొన్ని అవమానాల గురించి తెలియజేస్తూ పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేసింది. సినిమాలలోకి రాకమందు తన ఎక్కువగా షార్ట్ ఫిలిమ్స్ లో నటించేదాన్ని అని తెలియజేసింది. అలా 2013లో తను ఒక షార్ట్ ఫిలిం చేస్తున్న సమయంలో ఒక డైరెక్టర్ తనకు బాగా పరిచయమయ్యారని అయితే తనకు సినిమాల అవకాశాన్ని ఇస్తానని చెప్పి ఆమెను నమ్మించారట. కానీ అప్పుడు ఆ డైరెక్టర్ తన కమిట్మెంట్ అడగలేదని తెలియజేసింది. ఆ సమయంలో అలాంటివి ఉన్నాయా అని కూడా తనకు తెలియదని తెలిపింది.

Bigg Boss 5 Telugu: Sweta Varma Entered As 18th Contestant In House - Sakshi
అంతేకాదు తను ఈ విషయం అర్థం చేసుకోలేకపోయాను అని తెలిపింది. ఆ తర్వాత కొద్ది రోజులకి తను బరితెగించి మరి రెండు లక్షలు ఇస్తాను వస్తావా అని డైరెక్టుగా అడిగారట. అప్పుడు తన కోపం బాధ తట్టుకోలేకపోయాను అని తెలియజేసింది. అయితే తాను బాగా ధైర్యంగా ఉండే అమ్మాయిని అనుకోవాలో లేక పిరికి దాన్ని అనుకోవాలో అర్థం కాలేదు. .. కోపం ఆపుకోలేక ఆదర్శకుడిని ఉంటున్న ఇంటి పైనుంచి దూకేయండి.. ఇండస్ట్రీకి పట్టిన దరిద్రం పోతుంది అంటూ వార్నింగ్ ఇచ్చానని తెలియజేసింది శ్వేతా వర్మ. శ్వేత వర్మ బిగ్ బాస్ -5 లో పాల్గొనింది. ఇక తర్వాత ముగ్గురు మొనగాళ్లు, ది రోజ్ విల్లా, మిఠాయి వంటి చిత్రాలలో నటించింది.