స‌మంత సోష‌ల్ మీడియాకు దూరంగా ఉండ‌టానికి ఆ స్టార్ హీరోనే కార‌ణ‌మా?

స‌మంత‌..గౌతమ్ మీనన్ దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా తెరకెక్కిన ఏ మాయ చేసావే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది. ఇక ఆ తరువాత వరుసగా స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు పొంది.. స్టార్ హీరోయిన్గా ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలుగుతుంది. ఇకపోతే గత సంవత్సరం నుండి సమంతా మీద సోషల్ మీడియాలో అనేక రకాలుగా ట్రోల్స్ చేయడం మొదలుపెట్టారు. అందుకు అక్కినేని నాగచైతన్యకు విడాకులు ఇవ్వడమే కారణం.

ఈ క్ర‌మంలోనే సమంత చైతుకి విడాకులు ఇచ్చి వేరే వాళ్లతో ఎఫైర్ పెట్టుకుందని అక్కినేని అభిమానులు ఆమెపై ట్రోల్స్ చేశారు. అంతేకాదు సమంతకు పిల్లలు పుట్టారని అందుకే విడాకులు తీసుకున్నారని కూడా వార్తలు వ‌చ్చాయి. అయితే ఎలాంటి వార్తలు వచ్చినా కూడా సమంత చాలా ధైర్యంగా వాటిని ఎదుర్కొంటూ తన కెరీర్ పరంగా ముందుకు సాగుతోంది.

ఇదిలా వుంటే.. సమంత కొన్ని రోజులుగా సోషల్ మీడియాకి దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. అయితే అలా దూరంగా ఉండడానికి కారణం ఓ స్టార్ హీరో సమంతని తన ఫ్యూచర్ కోసం కొంతకాలం సోషల్ మీడియాకు దూరంగా ఉండమని సలహా ఇచ్చారట. ఇక ఆ కారణం చేతనే సమంత సోషల్ మీడియాకి దూరంగా ఉంటుందన్న వార్తలైతే వినిపిస్తున్నాయి. ఇక ఈ విషయం పక్కన పెడితే ఇటీవల సమంత తన ఇంస్టాగ్రామ్ బయోని మార్చేసింది. మీ సామర్థ్యాల పరిమితి ఎంత ఉన్నా దాన్ని ఇంకొంచెం విస్తరించాలి అంటూ సమంత తన ఇంస్టాగ్రామ్ బయోని మార్చేసింది. దీన్ని చూసిన సమంతా అభిమానులు ఈ వాక్యం ఆమెకు కరెక్ట్ గా సరిపోతుంది అని అంటున్నారు. ఏది ఎలా ఉన్నప్పటికీ సమంత మీద వచ్చే వార్తలు మాత్రం తగ్గడం లేదు.

ఇదిలా ఉంటే సమంత ప్రస్తుతం తెలుగులో యశోద, శాకుంతలం, ఖుషీ తో పాటు బాలీవుడ్‌లో ఓ వెబ్‌ సిరీస్‌లో నటిస్తూ అందరి దృష్టిని తనవైపు తిప్పుకుంది. వీటితో పాటు మరికొన్ని బాలీవుడ్ ప్రాజెక్టులను కూడా లైన్‌లో పెట్టాలని చూస్తోన్న సమంత ఓ హాలీవుడ్‌ చిత్రానికి సైతం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింద‌ట‌.