స‌ల్మాన్ ఖాన్ కాస్టింగ్ కౌచ్ అనుభ‌వం.. చిరు ఎదుటే సీక్రెట్ లీక్‌!

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటీంచిన లేటెస్ట్ సినిమా గాడ్ ఫాదర్. ఈ సినిమా ట్రైలర్ లాంచ్ శనివారం ముంబైలో భారీ ఎత్తున జరిగింది. ఇక ఈ ఈవెంట్ కి ప్రముఖ నటులు కూడా హాజరయ్యారు. వారిలో సల్మాన్ ఖాన్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. ఇక ఆయన వచ్చినప్పటినుండి ఏదో ఒకటి చేసి అందర్నీ నవ్విస్తూ ఆకర్షించాడు. ఇక సల్మాన్ ఖాన్ ఎక్కడ ఉంటే అక్కడ నవ్వులు అన్నట్లుగా తన కామెడీ టైమింగ్ తో అందర్నీ కడుపుబ్బా నవ్వించారు. అయితే చివరికి చిరంజీవిని కూడా వదిలిపెట్టలేదు.

అలా యాంకర్ చిరంజీవితో స్క్రీన్ షేర్ చేసుకోవడం పై సల్మాన్ ఖాన్ అభిప్రాయం ఎలా ఉంది అని అడగగా… దానికి సల్మాన్ ఖాన్ స్పందిస్తూ ఇలా చెప్పసాగారు. అలా సల్మాన్ ఖాన్ మాట్లాడుతూ..” కాస్టింగ్ కౌచ్ లేదు అని అంటున్నారా? మీరు చెప్పేది చాలా పెద్ద తప్పు? కాస్టింగ్ కౌచ్ అనేది ఉంది. ఎందుకంటే చిరంజీవి గారు నేను కలిసి అప్పట్లో థాయిలాండ్ ఒక కమర్షియల్ యాడ్ చేయడానికి వెళ్ళాం. మళ్లీ తిరిగి వచ్చేటప్పుడు మేమిద్దరం కలిసి 1:30 ముంబైకి చేరాం. ఇక ఉదయాన్నే చిరంజీవి హైదరాబాదుకి వెళ్లాల్సి ఉంది. కాసేపు ఇద్దరం కలిసి ముచ్చట్లు పెట్టుకున్నాం. ఆ తరువాత చిరంజీవి గారిని బెడ్ రూమ్ కి వెళ్లి పడుకో అని చెప్పాను.

 

ఇక దానికి చిరంజీవి నేను నీ కౌచ్ లోనే పడుకుంటాను అని చెప్పారు. కానీ నేను కూడా అందులోనే పడుకుంటాను క‌దా అని ఆయనకి ఎలా చెప్పాలి? అని ఆలోచించాను. కానీ మొత్తానికి ఇద్దరం వెళ్లి నిద్రపోయాం. ఇక మరుసటి ఉదయం చిరంజీవి విమానంలో హైద్రాబాద్ కు వెళ్ళిపోయారు. అయితే దీని బట్టి చూస్తే నేను కాకుండా నా కౌచ్ లో పడుకున్న ఒకే ఒక వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి. ఇక ఇలా నా విషయంలో కూడా కాస్టింగ్ కౌచ్ జరిగింది. అందుకే నేను చిరంజీవి గారితో కలిసి ఈ సినిమాలో నటించాను అంటూ సల్మాన్ ఖాన్ చాలా ఫన్నీగా స్పందించారు. ఇక ఆయన గాడ్ ఫాదర్ సినిమాలో ఒక చిన్న రోల్ చేశానని అలాగే చిరంజీవి గారు ఈ సినిమాలో నటించాలి అని అడగగానే ఓకే అని మాట ఇచ్చాను అని సల్మాన్ ఖాన్ చెప్పుకొచ్చారు. అలా సల్మాన్ ఖాన్ కాస్టింగ్ కౌచ్ అనుభవం చాలా ఫన్నీగా చిరు ముందు చెప్పుకొచ్చారు. ఇక గాడ్ ఫాదర్ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 5న రిలీజై తెలుగు ప్రేక్షకులను అలరించబోతున్నది అని చెప్పారు.