శ్రీరెడ్డి పై ఆర్జీవి చేసిన కామెంట్స్ వైరల్..!!

దాదాపుగా కొన్ని సంవత్సరాలుగా సినీ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ వివాదంపై ఎంతోమంది వ్యతిరేకంగా ఉద్యమించారు. అయితే అలాంటి వారిలో నటి శ్రీరెడ్డి కూడా ఒకరిని చెప్పవచ్చు. ఇక అప్పట్లో ఈమెకు మద్దతుగా రాంగోపాల్ వర్మ నిలవడంతో ఆ విషయం మరింత పాపులర్ అయింది. ముఖ్యంగా హైదరాబాద్ వీధుల్లో శ్రీరెడ్డి బట్టలు విప్పి తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి వెలుపల నగ్న నిరసన తెలియజేయడంతో దేశవ్యాప్తంగా ఈ విషయంపై ప్రతి ఒక్కరిని దిగ్భ్రాంతికి గురి చేసింది.

Ram Gopal Varma to direct Sri Reddy?

ఇక ఈ విషయం జాతీయ అంతర్జాతీయ పత్రికలలో కూడా వైరల్ గా మారింది. ముఖ్యంగా శ్రీ రెడ్డిని గతంలో ఝాన్సీరాణి తో పోల్చడం జరిగింది. సినిమా వచ్చిన వందేళ్ళ క్రితం నుంచి కాస్టింగ్ కౌచ్ అనేది ఉందని కానీ వ్యక్తిగత ఆరోపణల్లోకి రాకుండా గత వందేళ్లలో అందరికంటే ఎక్కువ దృష్టిని ఆకర్షించడంతో ఆర్జీవి ఆమెకు సెల్యూట్ చేస్తున్నానని ఎన్నోసార్లు తెలియజేశారు. ఇలాంటి వారిని అందించిన శ్రీ రెడ్డి తల్లిని చూసి మనం గర్వపడాలి అంటూ ట్విట్టర్ వేదికగా ఆర్జీవి పోస్ట్ చేయడం జరిగింది. అయితే ఆ తర్వాత మానవ హక్కుల కమిషన్ శ్రీరెడ్డి నిరసనను పరిగణలోకి తీసుకొని తెలుగు సినీ చరిత్రలో మహిళలపై లైంగిక వేధింపులు ఫిర్యాదులను పరిష్కరించే యంత్రాంగం ప్రవేశపెట్టింది.

I asked Sri Reddy to abuse Pawan Kalyan, says Ram Gopal Varma

ఇక అది విజయవంతం కావడంతో ఆర్జీవి శ్రీరెడ్డి తనకు ఝాన్సీ కి గొప్ప రాణి అయిన లక్ష్మీబాయి ని గుర్తు చేసిందని తెలిపారు. క్యాస్టింగ్ కౌచ్ దోపిడీపై అరికట్టడానికి ధైర్యం కావాలి .. అలాగే NHRC దృష్టికి తీసుకువెళ్లినందుకు ఇదొక అద్భుతమైన విజయం అని తెలియజేశారు. అయితే విజయాన్ని చారిత్రాత్మకంగా పోల్చడానికి లక్ష్మీబాయి తన కత్తిని ఆయుధంగా ఉపయోగించింది తన రాజ్యం కోసం పోరాడడానికి శ్రీ రెడ్డి అయిన ఈ లక్ష్మీబాయి సినిమా పరిశ్రమలో మా లేడమ్ తో పోరాడటానికి తన శరీరాన్ని ఆయుధంగా ఉపయోగించిందని ఆర్జీవి తెలిపారు. చివరికి శ్రీ రెడ్డి గురించి ఒక మాట మాట్లాడుతూ శ్రీరెడ్డి సంఘ సేవకి అంటూ కితాబిచ్చారు వర్మ.