స్టార్ హీరోస్ పై ప్రగతి ఆంటీ సంచలన కామెంట్స్.. వీడియో వైరల్..!

టాలీవుడ్ క్యారెక్ట‌ర్‌ ఆర్టిస్టుల్లో మంచి పేరు తెచ్చుకున్న నటీమణుల్లో ప్రగతి కూడా ఒకరు. టాలీవుడ్ లో ఉన్న స్టార్ హీరోలకు అత్త- అమ్మ పాత్రలో నటించి మెప్పించింది. తన సినిమాల్లో ఎంత క్లాస్ గా ఉంటుందో… తన పర్సనల్ లైఫ్ లో ఎంతో వైలెంట్ గా ఉంటుంది ప్రగతి. సినిమాలతో పాటు సోషల్ మీడియాలో ఈ సీనియర్ భామ మంచి యాక్టివ్ గా ఉంటుంది. సోషల్ మీడియాలో తన వర్కౌట్ వీడియోలను పెడుతూ నెటిజన్లుకు షాక్ ఇస్తూ ఉంటుంది. ప్రస్తుతం ఈమె టాలీవుడ్ లో వరుస సినిమాలతో బిజీగా ఉంది.

నటి ప్రగతి అందాల ఆరబోత.. ఈ వయసులోనూ అదే జోరు

ఈమధ్య కాలంలో వరస ఇంటర్వ్యూలు ఇస్తున్న ప్రగతి.. రీసెంట్ గా ఏబీఎన్ ఛానల్ కు ఓ ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ క్రమంలోనే ఓపెన్ హార్ట్ విత్ ఆర్కె ప్రోమో రిలీజ్ అయింది. ఆ ప్రోమోలో ప్రగతి ఆసక్తికర విషయాలు పంచుకుంది..ఎన్నో సెన్సేషనల్ కామెంట్ చేసింది. ఆ ప్రోమో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Character artist Pragathi Latest News in iDreamPost, Character artist Pragathi Top Headline, Photos, Videos Online | iDreamPost

ఈ సీనియర్ నటి తన కెరీర్ మొదట్లో హీరోయిన్గా కూడా పలు సినిమాల్లో నటించింది. చాలా తక్కువ సినిమాల్లో మాత్రమే హీరోయిన్ గా కనిపించింది. ఇదే విషయాన్ని ఆ ఇంటర్వ్యూలో అడగగా ప్రగతి షాకింగ్ ఆన్సర్ ఇచ్చింది. ‘మీరు హీరోయిన్గా ఎందుకు ఎక్కువ సినిమాలలో నటించలేదు అంటే… నేను రజనీకాంత్- కమలహాసన్ అయితేనే హీరోయిన్గాగా చేస్తాను.. వేరే వారితో నేను చేయను అని డైరెక్టర్ తో చెప్పానని ఆమె చెప్పింది’. హీరోలకు తల్లిగా నటిస్తూ మీరు ఇప్పుడు వచ్చే కుర్ర హీరోయిన్లకు మీరు గ్లామర్ షోలో పోటీ పడుతున్నారు అన్న ప్రశ్నకు… ‘ఎలా ఉన్నా నేను అందగత్తెనే… ఆందం వల్లే నాకు సినిమాలు వస్తున్నాయి అదే నాకు పెద్ద ఆస్తి’.. ప్రగతి చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ప్రగతి ఆంటీ చేసిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆదివారం వచ్చే మొత్తం ఇంటర్వ్యూలో మరిన్ని ఆసక్తికర విషయాలు అభిమానులతో పంచుకుందో లేదో చూడాలి.