పెళ్లి కూతురు గెటప్ లో కీర్తి సురేష్ ఫోటోలు వైరల్..!!

మహానటి చిత్రంతో జాతీయ అవార్డు అందుకున్న తమిళ హీరోయిన్ కీర్తి సురేష్ తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా సుపరిచితమే. ఇప్పటివరకు తెలుగులో ఎన్నో చిత్రాలలో నటించిన ఈ ముద్దుగుమ్మ తాజాగా హీరో నానితో కలిసి దసరా సినిమాలో నటిస్తున్నది. ఈ చిత్రానికి దర్శకత్వం శ్రీకాంత్ ఓదెల వ్యవహరిస్తూ ఉన్నారు. ఈరోజు కీర్తి సురేష్ పుట్టినరోజు సందర్భంగా దసరా సినిమాకు సంబంధించి ఆమె లుక్ ఎలా ఉంటుందో రివిల్ చేయడం జరిగింది. అయితే అలా రిలీవ్ చేసిన లుక్కుల కీర్తి సురేష్ కాస్త షాకింగ్ లుక్ లో ఉందని చెప్పవచ్చు.

Keerthy Suresh goes for the kill in Dasara | cinejosh.com
దసరా సినిమాలో నాని చాలా మాస్ పాత్రలో కనిపించబోతున్నట్లు ఇదివరకు విడుదలైన పోస్టర్స్ , గ్లింప్స్ ను చూస్తే మనకి అర్థమవుతుంది. తాజాగా కీర్తి సురేష్ పోస్టల్ కూడా అదే విషయాన్ని చెప్పకనే చెప్పబోతున్నట్లు కనిపిస్తోంది. కీర్తి సురేష్ మరొకసారి తన ప్రతిభను ఈ సినిమాలో చూపించబోతున్నట్లు ఈ పోస్టర్ చూస్తే మనకు క్లారిటీ వస్తుంది. కీర్తి సురేష్ కూడా ఈ చిత్రంలో కాస్త డీ గ్లామర్స్ గా కనిపించబోతోందని చెప్పవచ్చు. ఎక్కువగా తన పాత్రకు ప్రాధాన్యత ఉండే పాత్రని చేస్తూ ఉంటుంది కీర్తి సురేష్.

పోస్టర్ విషయానికి వస్తే కీర్తి సురేష్ ఎల్లో శారీలో మాస్ స్టెప్పులు వేస్తున్నట్లుగా కనిపిస్తూ ఉంది. పెళ్లికూతురుగా ముస్తాబయి చూడ చక్కని అందంతో కనిపిస్తోంది కీర్తి సురేష్. ఈ సినిమాలో వెన్నెల పాత్రలో కనిపిస్తోంది కీర్తి సురేష్.  దసరా సినిమా వచ్చే ఏడాది మార్చి 30వ తేదీన వేరుసెకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు సమాచారం ఈ చిత్రం కూడా ఒకే సారి తెలుగు,హిందీ, తమిళ్, మలయాళం, కన్నడ వంటి భాషలలో కూడా విడుదల చేయబోతున్నారు. ప్రస్తుతం కీర్తి సురేష్ కి సంబంధించి ఈ పోస్టర్ కాస్త వైరల్ గా మారుతోంది.

https://twitter.com/SLVCinemasOffl/status/1581889938320412677?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1581889938320412677%7Ctwgr%5E6b650a296f939c09ddb8a8dca0a1972ad4416019%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Fwww.thetelugufilmnagar.com%2F2022%2F10%2F17%2Fkeerthy-sureshs-first-look-from-nanis-dasara-is-out-now%2F