టైం ఎలా చూడాలో నేర్పించడానికి 20 డాలర్లు తీసుకున్న ఎన్టీఆర్.. కారణం ..?

తెలుగు సినీ ఇండస్ట్రీలో జూనియర్ ఎన్టీఆర్ కు ఎంత టాలెంట్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్టీఆర్ తో సరదాగా ఉంటే చాన్స్ దొరికినప్పుడల్లా ఇతరులను ఆటపట్టిస్తూ ఉంటారు. అలా ఇప్పుడు తాజాగా స్వాతి ముత్యం హీరో బెల్లంకొండ గణేష్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ గురించి పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించడం జరిగింది. వాటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

Aadhi telugu | Sun NXT
బెల్లంకొండ గణేష్ మాట్లాడుతూ తనకు కాన్ఫిడెన్స్ చాలా ఎక్కువగానే ఉంటుందని.. నేను చిన్నప్పటి నుంచి సెట్లోనే ఎక్కువగా పెరిగానని అందుచేతనే అలా ఫీల్ అవుతానని తెలియజేశారు. తనకు ఆరు సంవత్సరాల వయసు ఉన్న సమయంలోనే ఆది సినిమా షూటింగ్ సేట్టుకు వెళ్లానని గణేష్ తెలియజేశారు. అలా అప్పట్నుంచి సెలవులు దొరికినప్పుడల్లా షూటింగ్ సెట్ కే ఎక్కువగా వెళ్లేవాడిని తెలియజేశారు. అందుచేతనే నేను ఎక్కువగా సేట్ వాతావరణాన్ని ఇష్టపడతానని తెలియజేశారు. బయట నుంచి షూటింగ్ సెట్టింగ్ చూస్తే ఎవరు ఏం చేస్తున్నారో అర్థం కాదన.. అయితే యూనిట్ దగ్గరకు వెళ్లి చూడగానే కేవలం ఒక్క చిన్న కోసం 200 మంది పని చేయడం చేసి ఆశ్చర్యపోయారని తెలియజేశారు గణేష్.

Bellamkonda Ganesh | NTR collected 10 dollars..in the words of the new  hero..! » Jstimesnow
ఇక అలాంటివి చూసి సెట్ లో ఏదో ఒక పని చేయాలనుకున్నానని.. కానీ తీరా చూస్తే యాక్టర్ గా అవకాశం రావడంతో యాక్టింగ్ చేస్తున్నానని తెలియజేశారు. తెలుగు ఆడియన్స్ రిజెక్ట్ చేసినా ఇండస్ట్రీలో ఏదో ఒక విధంగా ఉంటానని గణేష్ తెలియజేశారు. తనకు టైం చూడడం నేర్పింది జూనియర్ ఎన్టీఆర్ అని తెలిపారు. ఆది సినిమా షూటింగ్ ఆస్ట్రేలియాలో జరుగుతూ ఉండగా.. వాచ్ లో టైం ఎలా చూడాలో చెప్పేందుకు తన దగ్గర నుంచి పది డాలర్లు తీసుకొని అన్నయ్యకు టైం ఎలా చూడాలో నేర్పించి అన్నయ్య దగ్గర 10 డాలర్లు మొత్తం 20 డాలర్లు ఎన్టీఆర్ తీసుకున్నారని గణేష్ తెలిపారు. ప్రస్తుతం బెల్లంకొండ గణేష్ చేసిన కామెంట్స్ వైరల్ గా మారుతున్నాయి.