కండక్టర్ ఝాన్సీకి చెక్ పెట్టిన నెల్లూరు కవిత.. ఆ పాటకి డాన్స్ ఇరగదీసేసింది?

కండక్టర్ ఝాన్సీ అంటే ఎవరో తెలియని యువత ఉండదు. ఆమధ్య జబర్దస్త్ అనే ప్రోగ్రాంలో ‘పల్సర్ బైక్’ పాటకి ఆమె వేసిన స్టెప్స్ యావత్ తెలుగు రాష్ట్రాలను ఒక ఊపు ఊపేసాయి. దాంతో ఒక్కసారిగా కండక్టర్ ఝాన్సీ ఫేమస్ అయిపోయింది. అక్కడినుండి ఆమె గతంలో చేసిన వివిధ డాన్స్ షోలకు సంబంధించిన వీడియోలు కూడా ఇపుడు వైరల్ అవుతున్నాయి. ఇకపోతే ఎక్స్ట్రా జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి షోస్ ద్వారా మల్లెమాలవారు ఎంతోమంది కొత్తవారికి అవకాశాలు కల్పించి టాలెంట్ నిరూపించుకొనే అవకాశం కల్పిస్తున్నారు.

తాజాగా మరొక అద్భుతమైన డాన్సర్ ని శ్రీదేవి డ్రామా కంపెనీ షో ఈ ప్రపంచానికి పరిచయం చేసింది. నెల్లూరు కి చెందిన కవిత అనే యువతికి తాజాగా శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో పాల్గొంది. ఇక ఈ ఎపిసోడ్ లో కండక్టర్ ఝాన్సీ కూడా పార్టిసిపేట్ చేసింది. ఆ వేదికపైన ఇద్దరూ పోటా పోటీగా తలపడ్డారు. కాగా ఈవారం ప్రసారం కాబోయే శ్రీదేవి డ్రామా కంపెనీ షో కి సంబంధించిన ప్రోమో ఇటీవల విడుదల అయింది.

ఇకపోతే ఈ ప్రోమోలో నెల్లూరు కవిత మాట్లాడుతూ.. శ్రీదేవి డ్రామా కంపెనీ షో ద్వారా కండక్టర్ ఝాన్సీ ఎంత ఫేమస్ అయ్యిందో అందరికీ తెలిసినదే. అయితే ఇప్పుడు ఆమెకు గట్టి పోటీ ఇవ్వటానికి నేను ఇక్కడికి వచ్చాను. కాసుకో ఝాన్సీ అంటూ తన టాలెంట్ మీద ఉన్న నమ్మకంతో సవాల్ విసిరింది. ఇక ఈ ఎపిసోడ్ ప్రోమో చూసినట్టైతే, ఇద్దరూ ఒకే పాటకు డాన్స్ చేస్తూ నువ్వానేనా అన్నట్టు పోటీ పడటం స్పష్టంగా కనబడుతోంది. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.