సినిమా రిలీజ్ అవ్వకముందేే బకరా అయినా మంచు విష్ణు.. అడ్డంగా బుక్ అయ్యారు గా..?

మంచు విష్ణు తాజాగా హీరోగా నటిస్తున్న సినిమా జిన్నా.. ఈ సినిమా రేపు విడుదల కాబోతుంది.. ప్రస్తుతం సినిమా ప్రమోషన్ లో బిజీగా ఉన్న చిత్ర యూనిట్ ఈ సినిమా ఎలాగైనా హిట్ అవుతుంది అన్న ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అయితే మరోవైపు సోషల్ మీడియాలో మాత్రం మంచు విష్ణు నటించిన జిన్నా సినిమా విడుదలై ప్లాఫ్ అయిందంటూ నెగిటివ్ టాక్ తీసుకువచ్చారు.. ఈ క్రమంలోనే అలాంటి తంనేల్స్ పెట్టి నెగిటివ్ ప్రచారం చేస్తున్న కొన్ని యూట్యూబ్ ఛానల్స్ పై మంచు విష్ణు ఫైర్ అయ్యారు.. అలా రిలీజ్ చేసిన కొన్ని చానల్స్ ను గుర్తించిన మంచు విష్ణు వాటి యూఆర్ఎల్స్ ల‌ను తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేస్తూ తీవ్ర స్థాయిలో వాటిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కొద్దిరోజుల్లోనే వాటిని మూసేయిస్తానంటూ వార్నింగ్ కూడా ఇచ్చారు.

Ginna Teaser Telugu | Vishnu Manchu | Sunny Leone | Paayal Rajput | AVA  Entertainment - YouTube

మంచు విష్ణు మాట్లాడుతూ..” నేను అనుకున్నట్టుగానే జరుగుతుంది.. ఇది ఒక పెయిడ్ బ్యాచ్’ చేయిస్తున్న పని.. ఎందుకింత మా మీద ద్వేషం..? సినిమా విడుదల అవకుండానె ఇంత అక్కస్సు ఎందుకు.. త్వరలోనే నేను వారి ఛానెల్‌లను మూసివేస్తా అంటూ వారిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డాడు మంచు విష్ణు”.