ప్రభాస్ కు తల్లిగా నటించలేను.. హీరోయిన్ అయితే ఆలోచిస్తానంటున్న మంచు లక్ష్మి!

నిత్యం ఏదోఒక విషయమై వార్తల్లో వుండే మంచు లక్ష్మి తాజాగా ప్రభాస్ విషయంలో టాక్ అఫ్ ది టౌన్ అయింది. రాజమౌళి – ప్రభాస్ దర్శకత్వంలో బాహుబలి తెరకెక్కిన విషయం విదితమే. ఈ సినిమాలో రమ్యకృష్ణ చేసిన శివగామిని పాత్రకు ఎంత ప్రాధాన్యత దక్కిందో అందరికీ తెలిసినదే. రమ్యకృష్ణ తనదైన నటనతో శివగామి పాత్రను మరొక లెవల్ కు తీసుకొని వెళ్లారు అని చెప్పవచ్చు. ఇకపోతే ఈ సినిమాలో రమ్యకృష్ణ పాత్రలో మొదట పలువురిని సంప్రదించారు అన్న విషయం అందరికీ తెలిసినదే.

ఈ విషయం రాజమౌళి పలుసార్లు మీడియా ముందు చెప్పాడు. ఇకపోతే బాహుబలి సినిమాలో రమ్యకృష్ణ నటించిన శివగామి పాత్ర కోసం రాజమౌళి మంచు లక్ష్మిని కూడా సంప్రదించాడట. కానీ మంచు లక్ష్మి మాత్రం ఆ పాత్రను రిజెక్ట్ చేసిందట. విషయం ఏమంటే ప్రభాస్ కు తల్లిగా అంటే కష్టమని చెప్పిందంట. తాజాగా ఈ విషయం ఓ మీడియా వేదికగా మంచు లక్ష్మి చెప్పింది. అదొక ప్రత్యేకమైన సినిమా కావచ్చు కానీ ఆ పాత్రకు నేను కరెక్ట్ కాదు అని నాకు అనిపించింది అని చెప్పుకొచ్చింది మంచు లక్ష్మి.

కాగా దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్స్ ‘మంచి నిర్ణయం తీసుకున్నావు’ అని ఒకరంటే, ‘నువ్వు చేసుంటే బాహుబలి, మహాబలి అయుండేది’ అని మరొకరు, ‘సూపర్ డెసిషన్ మంచక్క’ అని వేరొకరు కామెంట్స్ చేస్తున్నారు. ఇకపోతే మంచు లక్ష్మి ‘అనగనగా ఒక ధీరుడు’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఆ సినిమా ప్రేక్షకులను మాత్రం ఆకట్టుకోలేకపోయింది.