కృష్ణంరాజు వల్ల అలాంటి సహాయం పొందిన కోటా శ్రీనివాసరావు..!!

టాలీవుడ్ లో సీనియర్ హీరో కృష్ణంరాజు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కృష్ణంరాజు చేసిన దానధర్మాలు ఆయన చేసిన మంచి పనులు ఇప్పటికీ అక్కడక్కడ కొంతమంది చెబుతూనే ఉంటారు. కేవలం కృష్ణంరాజు కాకుండా తన కుటుంబంలో ఎవరు కూడా చేసిన సహాయం, దానధర్మాల గురించి ఎక్కడ చెప్పుకోరు దీంతో వారి యొక్క గొప్పతనం ఏంటో మనం అర్థం చేసుకోవచ్చు. అందుచేతనే కృష్ణంరాజు చాలా మంచి వ్యక్తి అని ఇండస్ట్రీ ఎప్పుడు పొగుడుతూ ఉంటుంది. తన తోటి నటీనటులకు కూడా ఆయన ఇచ్చే మర్యాద , సహాయం గురించి కూడా తను మరణించినప్పుడు ఎంతోమంది నటీనటులు సైతం తెలియజేశారు.

It was Krishnam Raju who showed the way to Kota Srinivas Rao and fixed the  remuneration!
ఇక కోట శ్రీనివాసరావు కూడా కృష్ణంరాజు సహాయం పొందినట్లుగా తెలియజేస్తున్నారు. కోట శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ఇండస్ట్రీకి అప్పుడప్పుడే ఎంట్రీ ఇస్తున్న సమయంలో తనకి ఏమీ తెలియక నలిగిపోతున్న రోజుల్లో తనకు కొన్ని కాల్ షీట్స్ తీసుకోవాలని కూడా తెలియని పరిస్థితుల్లో ఎక్కడ షూటింగ్ ఉంటే అక్కడికి వెళ్లి పోయేవారట. రెమ్యూనరేషన్ విషయంలో కూడా ఎంత తీసుకోవాలో కోట శ్రీనివాస్ కి అసలు తెలియదట. అలా ఒకరోజు కృష్ణంరాజు ప్రొడక్షన్ కంపెనీ అయిన గోపికృష్ణ ఆఫీస్ కి వెళ్లారట.

Veteran Actor Kota Srinivasa Rao Again Takes a Jibe at Megastar Chiranjeevi
ఆ సమయంలో తాండ్ర పాపారాయుడు చిత్రంలో 15 రోజులు కోటా శ్రీనివాసరావు నటించారట. కృష్ణంరాజు సోదరుడు ప్రభాస్ తండ్రి సూర్యనారాయణ రాజు లెక్కలు చూసేవారు. అలా రెమ్యూనరేషన్ అందుకోవడం కోసం ఆఫీసుకు వెళ్లగా ఎంత ఇమ్మంటారో చెప్పమని సూర్యనారాయణ కృష్ణంరాజును అడగగా అసలు రెమ్యూనరేషన్ ఇంత తీసుకోవాలన్న విషయం కూడా కోటాకు క్లారిటీ లేదని నవ్వుతూ తెలియజేశారట. ఆ సమయంలో కోట నటన చూసి బాగా చేశావు ఇలాగే కొనసాగించు మంచి నటుడు అవుతావని తెలియజేశారట. అలా కేవలం 15 రోజులకు రూ.20,000 రూపాయలు ఇచ్చి పంపించారట. నీకు ఎంత కావాలో అడిగి తీసుకోవాలని సలహా ఇచ్చారట. ఇక అప్పటి నుంచి కోట తన రెమ్యూనరేషన్ అలా నెమ్మదిగా పెంచుకుంటూ వెళ్లాను అని తెలిపారు ఆ విధంగా కృష్ణంరాజు ఆరోజు చెప్పకుంటే చాలామంది చేతిలో మోసపోయేవాడిని అని తెలిపారు కోటా శ్రీనివాసరావు.